Tomato Prices Fall Down in AP: ఆరుగాలం శ్రమించి, రూ.లక్షల ఖర్చు చేసి టమాటా సాగుచేస్తే కనీసం పెట్టుబడి రావడం లేదని టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పతనమై రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు తగ్గడం, అదే సమయంలో గిట్టుబాటు ధరలు (Affordable Prices) లభించక అన్నదాతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Tomato Farmers Problem in Chittoor:చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల కురిసిన వర్షాలతో టమాటా పంటకు తెగుళ్లు సోకి దిగుబడులు తగ్గాయి. చేతికి అందిన కాస్తా పంట నాణ్యత లోపించింది. 15 కిలోల పెట్టె జూన్‌లో రూ.800- రూ.1000 మధ్య ధర ఉండేది. ప్రస్తుతం రూ.250- రూ.300 మాత్రమే వస్తోందని రైతులు వాపోతున్నారు. దీంతో పలుచోట్ల కూలీల ఖర్చు కూడా రావడం లేదని రోడ్డు పక్కనే పడేసి వెళ్లిపోతున్నారు.
పెట్టుబడులు పెరిగినా నాటి ధరే :టమాటా సాగులో ఏటికేడు పెట్టుబడులు పెరిగిపోతున్నాయని అన్నదాతలు పేర్కొన్నారు. ఎకరాకు రూ.1.50 లక్షల - రూ.2 లక్షల వరకు ఖర్చవుతోందని తెలియజేశారు. మూడేళ్ల కిందట ఇందులో సగం ఖర్చులే వచ్చేవని తెలిపారు. అప్పుడున్న ధరలే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురంలో జాతీయ రహదారిపై టమాటా రైతుల ఆందోళన - Tomato Farmers Agitation