ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగుజాతి మహాశక్తిని కోల్పోయింది: చిరంజీవి - Chiranjeevi Tribute To Ramoji Rao - CHIRANJEEVI TRIBUTE TO RAMOJI RAO

Chiranjeevi Tribute To Ramoji Rao : ఈనాడు గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావు మరణంపట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం సినీలోకానికి తీరని లోటని అన్నారు. ఈ క్రమంలో రామోజీ పార్థివదేహానికి నివాళులు అర్పించిన మెగాస్టార్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే సినీ హీరో నాగార్జున సైతం నివాళులు అర్పించారు.

Chiranjeevi Tribute To Ramoji Rao
Chiranjeevi Tribute To Ramoji Rao (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 8, 2024, 7:47 PM IST

Chiranjeevi Tribute To Ramoji Rao : ఈనాడు గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావు అస్తమించారు. ఆయన మరణవార్త విని సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మతిపట్ల కొందరు తారలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తుంటే మరికొందరు హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ఉంచిన ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించి అంజలి ఘటిస్తున్నారు.

Chiranjeevi About Ramoji Rao :ఈ క్రమంలో సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి రామోజీ ఫిలింసిటీకి వచ్చారు. రామోజీ పార్థివదేహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనాడు గ్రూప్​ ఛైర్మన్​ రామోజీరావు మరణం తీరని లోటు అని సినీ నటుడు, మెగాస్టార్​ చిరంజీవి అన్నారు.

తెలుగుజాతి గొప్ప వ్యక్తిని, మహాశక్తిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అనేకసార్లు రామోజీరావు సలహాలు తీసుకున్నానని తెలిపారు. పెన్నులు సేకరించడం రామోజీ హాబీ అని చెప్పారు. రామోజీరావు తన ఆలోచనలను డెయిరీలో రాసుకునేవారన్నారు. సమాజానికి ఏం చేయాలని నిరంతరం తపన పడేవారని చిరంజీవి తెలిపారు.

రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించిన చిరంజీవి (ETV Bharat)

"రామోజీరావు మరణం తీరనిలోటు. తెలుగుజాతి గొప్ప వ్యక్తిని, మహాశక్తిని కోల్పోయింది. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. రామోజీ కుటుంబ సభ్యులు, సిబ్బందికి నా ప్రగాఢ సానుభూతి. అనేకసార్లు రామోజీరావు సలహాలు తీసుకున్నాను. పెన్నులు సేకరించడం ఆయన హాబీ. తన ఆలోచనలను డెయిరీలో రాసుకునేవారు. సమాజానికి ఏం చేయాలని నిరంతరం తపన పడేవారు."- చిరంజీవి, సినీనటుడు

Nagarjuna About Ramoji Rao : రామోజీరావు పార్థివదేహానికి సినీ నటుడు నాగార్జున నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన అనంతరం తన కుటుంబ సభ్యులను పలకరించారు. వారిని ఓదార్చారు. నాగార్జున వెంట ఆయన సోదరి నాగసుశీల కూడా ఉన్నారు. ఆమె కూడా రామోజీ పార్థివదేహానికి పూలు సమర్పించి అంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులు ఓదార్చారు.

రామోజీరావుకు నివాళులర్పించిన ప్రముఖ దర్శకులు - Film Directors Paid Tribute to Ramoji Rao

'ప్రజా గొంతుకై మోగిన నిలువెత్తు అక్షరసేనానికి అశ్రునివాళి' - AP Politicians Tribute to Ramoji Rao

ABOUT THE AUTHOR

...view details