తెలంగాణ

telangana

ETV Bharat / state

టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు - ఆ కేసులన్నీ కొట్టివేత - టాలీవుడ్ డ్రగ్స్ కేసు

Tollywood Drugs Case Latest Update : టాలీవుడ్​ డ్రగ్స్​ కేసు కీలక మలుపు తిరిగింది. ఎక్సైజ్​ శాఖ 2017లో నమోదు చేసిన ఆరు కేసులను కోర్టు కొట్టివేసింది. డ్రగ్స్‌ కేసులో సరైన ప్రొసీజర్‌ పాటించకపోవడం వల్లే కేసులను కొట్టివేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

Tollywood Drugs Case
Tollywood Drugs Case Latest Update

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2024, 4:56 PM IST

Updated : Feb 1, 2024, 10:46 PM IST

Tollywood Drugs Case Latest Update :2017లోరాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటాలీవుడ్ డ్రగ్స్‌ కేసుకు(Tollywood Drugs Case) సంబంధించి నమోదైన కేసులలో ఆరింటిని నాంపల్లి కోర్టు కొట్టేసింది. సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడంతో కేసులు కొట్టివేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. డ్రగ్స్‌ కేసు నమోదులో సరైన ప్రొసీజర్‌ పాటించలేదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది.

Tollywood Drugs Case Update : టాలీవుడ్‌లో మరోసారి మత్తు కలకలం!.. నిందితుల్లో సినీ దర్శకుడు, మాజీ ఎంపీ కుమారుడు

2017 జులైలో ఆబ్కారీ శాఖ డ్రగ్స్ కేసు నమోదు చేసింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్‌ను(Drug Dealer Kelvin) అరెస్ట్ చేసిన ఆబ్కారీ పోలీసులు, అతని సెల్‌ఫోన్‌, బ్యాంకు ఖాతాల ఆధారంగా దాదాపు 60 మందిని ప్రశ్నించారు. బాలానగర్, సికింద్రాబాద్, గోల్కొండ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసులను సిట్‌కు బదిలీ చేశారు. సిట్ అధికారులు 30 మందిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. సినీ రంగానికి చెందిన 12 మందిని పిలిచి ప్రశ్నించారు.

'మీ పార్శిల్​లో డ్రగ్స్​ ఉన్నాయి - నేనడిగినంత డబ్బివ్వకపోతే జైలుకెళ్లడం ఖాయం'

కొందరి వెంట్రుకలు, గోర్ల నమూనాలు సేకరించారు. దర్యాప్తు పూర్తైన తర్వాత ఆబ్కారీ అధికారులు 12 నేరాభియోగ పత్రాలను వివిధ కోర్టులలో దాఖలు చేశారు. కానీ ఏ నేరాభియోగపత్రంలోనూ సినీ రంగానికి చెందిన వాళ్ల పేర్లను పొందుపర్చలేదు. మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన కొంతమందిని నేరాభియోగ పత్రాల్లో నిందితులుగా పేర్కొన్నారు. వాళ్ల పాత్రపైన సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో ఇందులో నాంపల్లి కోర్టు 4 కేసులను, రంగారెడ్డి జిల్లా కోర్టు రెండు కేసులను కొట్టేసింది.

ప్రస్తుతం మరో ఆరు కేసులు మల్కాజిగిరి, నాంపల్లి కోర్టులలో నడుస్తున్నాయి. ఇందులో బాలానగర్ ఆబ్కారీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో కెల్విన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు మల్కాజ్‌గిరి కోర్టులో విచారణ దశలో ఉంది. కెల్విన్ విదేశాల నుంచి మాదక ద్రవ్యాలు తెప్పించి పలువురికి విక్రయించినట్లు ఆబ్కారీ అధికారులు నేరాభియోగపత్రంలో పొందుపర్చారు.

టాలీవుడ్​ డ్రగ్స్​ కేసుకు సంబంధించి సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్​, హీరోయిన్ ఛార్మి, ముమైత్​ఖాన్​, నటులు తరుణ్​, నవదీప్​లను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ అధికారులు పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. వీరితో పాటు నందు, మాస్​ మహారాజా రవితేజ, తనీష్​లూ ఈ లిస్ట్​లో ఉన్నారు.

Tollywood Drugs Case Updates : టాలీవుడ్ ప్రముఖుల్లో 'డ్రగ్స్‌' దడ.. ఎప్పుడు ఎవరి పేరు తెరపైకొస్తుందోనని టెన్షన్‌.. టెన్షన్‌..

Last Updated : Feb 1, 2024, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details