తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్ - ఆ దర్శన టికెట్ల కోటా పెరిగింది - TIRUMALA SRIVANI OFFLINE TICKETS

రోజుకు 900 మందికి టికెట్లను ఆఫ్‌లైన్ విధానంలో కేటాయించనున్న టీటీడీ - భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడి

Srivani Darshan Ticket Allocation Made Easy
Srivani Darshan Ticket Allocation Made Easy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2024, 3:42 PM IST

Srivani Darshan Ticket Allocation Made Easy :తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్​ న్యూస్​ తెలిపింది. ఈ మేరకు శ్రీవాణి దర్శన టికెట్ల ఆఫ్‌లైన్‌ కేటాయింపునకు నూతన కౌంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్థానిక గోకులం మీటింగ్‌ హాల్ వెనుక వైపు ఈ కౌంటర్​ను టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి బుధవారం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఉన్న కౌంటర్​ వద్ద వర్షాకాలంలో భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి కొత్త కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు.

రోజుకు 900 టికెట్లను ఆఫ్‌లైన్‌ విధానంలో కేటాయిస్తున్నట్లుగా ఎగ్జిక్యూటివ్ అధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. గతంలో టికెట్‌ కేటాయింపునకు 3 నుంచి 4 నిమిషాలు పట్టేదని ఆయన వివరించారు. ప్రస్తుతం నిమిషంలో భక్తులకు టికెట్‌ ఇచ్చేలా అప్లికేషన్‌లో మార్పు చేర్పులు చేశామన్నారు. 5 కౌంటర్లలో భక్తులు సులభంగా టికెట్లు కొనుక్కోవచ్చని ఆయన పేర్కొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న అరవింద్ కేజ్రీవాల్‌ :శ్రీవారి దర్శనానికి ప్రముఖులు పెద్ద ఎత్తున వచ్చారు. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమ తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. వేకువ జామున వారు శ్రీవారి అర్చన సేవలో పాల్గొన్నారు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనమనంతరం మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ దేశం సుభిక్షంగా ఉండాలని దేవుని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని తిరుమలేశుని ప్రార్థించానని వివరించారు. చిల్డ్రన్స్‌ డే సందర్భంగా ఆయన పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు : తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర, సినీ గాయకుడు విజయ్‌ ప్రకాశ్‌, కర్ణాటక శృంగేరీ శారద పీఠాధిపతి విధుశేఖర స్వామిజీ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమలేశుని సేవలో పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్ద విధుశేఖర స్వామిజీకి తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీనివాసుని దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో తిరుమలలో చాలా అపచారాలు జరిగాయని కొల్లు రవీంద్ర చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో పవిత్రత పునరుద్ధరణ జరుగుతోందని తెలిపారు. అన్నప్రసాదాలను స్వీకరిస్తుంటే ఆత్మ సంతృప్తి కలుగుతోందని వివరించారు. రాష్ట్రంలోని ని రుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కలగాలని శ్రీవారిని ప్రార్థించానట్లుగా కొల్లు రవీంద్ర వెల్లడించారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి అన్ని నెలల నిరీక్షణా! - ఇదే పద్దతి గోవిందా?

తిరుమలలో భారీ వర్షం - ఇబ్బందిపడుతున్న భక్తులు

ABOUT THE AUTHOR

...view details