Tips For Driving in Foggy Weather Conditions :అసలే చలకాలం బైక్ మీద వెళ్లినా, కారులో వెళ్లినా ఎలాంటి ప్రయాణమైనా విపరీతమైన వణుకు పుట్టిస్తుంది. శీతాకాలం వచ్చేసిందంటేనే తెల్లవారుజామున రహదారులపై పొగమంచు కమ్మేస్తోంది. వాహనాలు నడిపేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు తప్పవని వాహన నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదాలూ జరిగే అవకాశమూ ఉందంటున్నారు. ఒకవేళ పొరపాటున గాయం గానీ అయితే విపరీతమైన మంట పుడుతుందంటున్నారు.
కనుక చలికాలం ప్రయాణాలకు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనికోసం డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుతున్నారు. ఎముకలు కొరికే చలి కాలంలో, దారి కమ్మే పొగమంచు వేళలో డ్రైవింగ్ సాఫీగా సాగిపోయే సూపర్ టిప్స్ ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫాగ్ లైట్లు :శీతాకాలం కనుక దారంతా పొగమంచు కమ్ముకుని ఉంటుంది. ముందు ఏ వాహనం వస్తుందో, జంతువు వస్తుందా, మరేదైనా వస్తుందా అనేది పోల్చుకోలేం. కాబట్టి వాహనాలకు ఫాగ్ లైట్లు వాడటం మంచిది. ఇవి పొగమంచులో దారిని మెరుగ్గా కనిపించేలా చేస్తాయి. దీంతో డ్రైవింగ్ సేఫ్గా సాగుతుంది.
కారు కోసం ఈ ట్రిక్ :వాతావరణం పొగమంచుతో నిండి ఉన్నప్పుడుకార్లు నడిపే సమయంలో విండీషీల్డ్ వైపర్లు, డీఫ్రాస్టర్లు వాడాలి. వీటి ద్వారా మార్గం చక్కగా కనిపిస్తుంది.
సే నో టూ హైబీమ్ లైట్స్ :పొగమంచులో హైబీమ్ లైట్లు అంత మంచివి కాదు. వీటి వల్ల మార్గం స్పష్టంగా కనిపించదు. కాబట్టి సాధ్యమైనంతవరకు వీటి వాడకం తగ్గిస్తే మేలు.