Tiger in Amrabad Tiger Reserve: తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యం (Amrabad Tiger Reserve)లో బుధవారం పర్యాటకులకు పెద్దపులి కనిపించింది. సఫారీ రైడ్‌లో ప్రయాణిస్తున్న సందర్శకులకు గుండం ప్రాంతంలో అత్యంత దగ్గరలోనే పెద్దపులి కనిపించటంతో వారంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పులి కనిపించడంతో పర్యాటకులు ఎంతో ఆనందానికి గురయ్యారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో సుమారు 40 వరకు పెద్దపులులు ఉన్నాయి. ఎక్కువగా ఇవి లోతట్టు అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి. పర్యాటకులు సందర్శించే ప్రాంతాల్లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.
అదిగో పెద్దపులి - వారి ఆనందానికి అవధులు లేవు - TIGER IN AMRABAD TIGER RESERVE
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో పర్యాటకులకు కనిపించిన పెద్దపులి - సంభ్రమాశ్చర్యాలకు గురైన సందర్శకులు
Tiger in Amrabad Tiger Reserve (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : 5 hours ago
|Updated : 3 hours ago
Last Updated : 3 hours ago