Three Youngsters Drowned in Check Dam in Vizianagaram :ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలోని జామి మండలం జాగరం వద్ద చెక్‌డ్యామ్‌లో ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. ఇవాళ ఉదయం విజయనగరానికి చెందిన ఆరుగురు యువకులు గోస్తని నదిలో ఈత కొట్టడానికి వచ్చారు. వీరిలో ఒకరు ఈత కొట్టడానికి మొదట దిగారు. ప్రమాదవత్తూ అతడు నీటిలో మునిగిపోయారు. చెక్‌డ్యామ్‌లో మునిగిన యువకుడిని కాపాడేందుకు ఒకరి తర్వాత ఒకరు వెళ్లినట్లు తోటి స్నేహితులు సమాచారం ఇచ్చారు. ఇందులో ఒక యువకుడి మృతదేహన్ని పోలీసులు గుర్తించారు.
మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విజయనగరం కంటోన్మెంట్‌కు చెందిన ఆరుగురు యువకులు చెక్‌డ్యామ్‌లో స్నానానికి దిగినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. చెక్‌డ్యామ్ దిగువన జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గల్లంతైన అశోక్(19), షాకిత్(16), రజిక్(14) కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.