West Godavari Dead Body in Parcel Case Update :ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలో చెక్క పెట్టెలో మృతదేహం కేసు దాదాపుగా కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. తన వదిన తులసిని బెదిరించి, ఆస్తి కాజేసేందుకు శ్రీధర్ వర్మ, అతడి రెండో భార్య రేవతి (తులసి చెల్లెలు), వర్మ ప్రియురాలు సుష్మ కలిసి పర్లయ్యను హత్య చేసిన విషయాన్ని వారు పోలీసుల ముందు అంగీకరించినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శవాన్ని ఇంటికి పంపడం ద్వారా తులసిని భయపెట్టి ఆస్తి రాయించుకోవాలని ప్లాన్ చేశారు. అందుకు ఎక్కడైనా శవం దొరుకుతుందేమోనని గాలించగా దొరకలేదు. అప్పుడు ఒంటరిగా ఉంటున్న పర్లయ్యను చంపాలని నిర్ణయించుకున్నారు. అతడిని మాటల్లో పెట్టి మద్యం తాగించి, మత్తులో ఉండగా కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. నైలాన్ తాడును మెడకు బిగించి హత్య చేశారని తెలిసింది.
పరువు హత్య! - ఇంటికి వస్తే ఘనంగా పెళ్లి చేస్తామన్నారు - చంపేసి పారిపోయారు!!
చాకచక్యంగా వ్యవహరించిన తులసి : పర్లయ్య మృతదేహాన్ని గాంధీనగర్‌లో ఇంట్లోని చెక్కపెట్టేలో పెట్టారు. మరుసటి రోజు ఆటోలో యండగండిలోని తులసి ఇంటికి శవాన్ని పార్సిల్ చేశారు. చెక్కపెట్టే తెరిచి అందులోని శవాన్ని చూసి తీవ్ర ఆందోళనకు గురైన తులసితో శవం విషయం బయటకు పొక్కకుండా చూసుకుంటానని అందుకు ఆమెను ఆస్తి పత్రాలపై సంతకాలు చేయాలని అడిగారు. సంతకం చేయాలని తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. సంతకం పెడతావా లేదా నువ్వూ శవమవుతావా? అని ఆమెను బెదిరించారని, తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాగేసుకున్నారని అంటున్నారు. దీంతో వాళ్ల నుంచి తప్పంచుకోడానికి మూత్రశాలకని వెళ్లాలి అని చెప్పి వెళ్లింది. చాకచక్యంగా తన దగ్గర ఉన్న మరో ఫోన్‌తో తెలిసిన వారికి సంక్షిప్త సమాచారం అందించింది. ఆమె సమాచారంలో కొంతమంది ఇంటికి చేరుకుని ఏం జరిగిందని ఆరా తీస్తూ, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శ్రీధర్ వర్మ అక్కడి నుంచి పారిపోయాడు.