ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పురుగులు వచ్చిన మాట నిజమే' - ఏఎన్​యూ సిబ్బంది అంతా ఒకే మాట - COMMITTEE INQUIRY ON FOOD QUALITY

నాగార్జున వర్సిటీలో త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభం - వసతిగృహంలో నాసిరకం ఆహారంపై విచారించిన కమిటీ - సమస్యలపై విద్యార్థినులతో మాట్లాడిన కమిటీ సభ్యులు

Committee Began Inquiry On Substandard Food at Anu University
Committee Began Inquiry On Substandard Food at Anu University (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2024, 10:41 PM IST

Committee Began Inquiry On Substandard Food at ANU : ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నాసిరకం భోజనంపై త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభించింది. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి కోమలి, ఆహారభద్రత అధికారి రవీంద్రారెడ్డి వర్సిటీకి చేరుకుని విచారణ మొదలుపెట్టారు. సుమారు 50 మంది విద్యార్ధినుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు గంటా నలభై నిమిషాలపాటు విద్యార్ధినులను కమిటీ సభ్యులు విచారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు వసతిగృహ సిబ్బంది, చీఫ్ వార్డెన్ తమపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నట్లు కమిటీ ముందు కొంతమంది విద్యార్థినులు చెప్పినట్లు తెలిసింది. గత రెండు నెలలుగా ఆహారంలో పురుగులు వస్తున్నాయని ఈ విషయాన్ని వసతిగృహ సిబ్బందికి చెప్పగా, వారు చాలా తేలిగ్గా తీసుకున్నారని కమిటీకి సభ్యులకు విద్యార్థినిలు చెప్పినట్లు సమాచారం.

భోజనంలో ఉదయం కప్ప, రాత్రి పురుగులు - ఇదేమి మెను కాదు !

శనివారం మధ్యాహ్నం వంటగదిలోకి కప్ప వచ్చిందని అక్కడ ఉన్న సిబ్బందికి చెప్పామని తెలిపారు. మళ్లీ సాయంత్రం అన్నంలో పురుగులు రావడంతో ఒక్కసారిగా ఆందోళన చేపట్టామని విద్యార్థినిలు కమిటీ ముందు చెప్పినట్లు తెలిసింది. వసతిగృహంలోని మెస్​లో అపరిశుభ్రమైన వాతావరణం వల్ల పురుగులు వస్తున్నాయని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. బొద్దింకలు, తూనీగలు, పురుగులు వస్తూనే ఉన్నాయని వెల్లడించారు. మెస్​లో చివర్లో వచ్చేవాళ్లకు పెరుగు ఉండటంలేదని, సిబ్బందిని అడిగితే అయిపోతోందని నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని విద్యార్థినులు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.

వైఎస్సార్సీపీ విధేయ వీసీ రాజీనామా- ఉద్యోగులు, విద్యార్థుల సంబరాలు - ANU VC Rajasekhar Resigned

అనంతరం కమిటీ సభ్యులు మెస్ సిబ్బందిని విచారించారు. వారంతా ఒకే మాటపై నిలబడినట్లు సమాచారం. గతంలో ఒకటి, రెండు సార్లు భోజనంలో పురుగులు వచ్చినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. కప్ప వచ్చిన విషయం తమకు తెలియదని కమీటి ముందు చెప్పినట్లు సమాచారం. విద్యార్థినిలతో విచారణ ముగిసిన తరువాత పెదకాకాని పోలీసులను కమిటీ సభ్యులు విచారించారు. సీఐ నారాయణ స్వామి, ఎస్ఐ మీరజ్​లను విచారించారు. ఆందోళన ఎలా జరిగింది? ఆరోజు రాత్రి ఏం జరిగిందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

నన్నయ విశ్వవిద్యాలయానికి కొత్త ఇంఛార్జ్ వీసీ నియామకం- బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు - ANU New incharge VC

ABOUT THE AUTHOR

...view details