తెలంగాణ

telangana

ETV Bharat / state

మిస్టరీగా మారిన ముగ్గురు మహిళల మృతి - హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు - Three LADIES DEAD BODIES IN POND - THREE LADIES DEAD BODIES IN POND

Three Ladies Dead Bodies Found in Pond at Kurnool : ఏపీలోని కర్నూలు జిల్లాలో ముగ్గురు గుర్తుతెలియని మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. స్థానిక నగరవనం చెరువులో తొలుత ఇద్దరి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం చెరువు ఒడ్డుపై మరో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Three Ladies Dead Bodies Found in Pond at Kurnool
Three Ladies Dead Bodies Found in Pond at Kurnool (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 19, 2024, 10:22 PM IST

Three Ladies Dead Bodies Found in Pond at Kurnool :ఆంధ్రప్రదేశ్​లోనికర్నూలు జిల్లాలో ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా మృతి చెందటం తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని గార్గేయపురం గ్రామ శివారులో ఉన్న నగరవనం (Nagaravanam) చెరువులో తొలుత ఇద్దరి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాలను పరిశీలించారు.

మిస్టరీగా మారిన ముగ్గురు మహిళల మృతి - హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు (ETV Bharat)

అనంతరం చెరువు ఒడ్డున మరో మృతదేహాన్ని గుర్తించారు. మృతులు ఎవరు? ఎలా చనిపోయారు? అనేది మిస్టరీగా మారింది. ఎవరైనా చంపి చెరువులో పడేశారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మృతులు ఎవరు? ఎలా చనిపోయారు? అంతు చిక్కని ప్రశ్నలు : కర్నూలు సమీపంలోని గార్గేయపురం గ్రామంలో ఉన్న నగరవనం చెరువులో ఈ రోజు(ఆదివారం) ముగ్గరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తొలుత చెరువులో ఇద్దరి మృతదేహాల్ని స్థానికులు గుర్తించి కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. అయితే చెరువు ఒడ్డున మరో మృతదేహాన్ని వారు గుర్తించారు. మృతులు ఎవరు? ఎలా చనిపోయారు? అనేది ప్రస్తుతం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. మృతదేహాలను శవపరీక్ష కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

"ఎనిమిది గంటలకు రెండు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు చెరువులో తేలియాడుతున్నట్లు సమాచారం వచ్చింది. ఈ మృతదేహాలకు కొంచెం దూరంలోనే మరో మృతదేహం గుర్తించడం జరిగింది. ఇది హత్య, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేయడం జరుగుతుంది - కృష్ణకాంత్, కర్నూలు ఎస్పీ

చెరువులో మృతదేహం.. ప్రమాదమా?.. హత్యా!

Police Investigation on Three Ladies Dead Bodies : ముగ్గురు మహిళలు చనిపోవడంతో వారిని ఎవరైనా హత్య చేసి చెరువులో పడేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. శవపరీక్షల నివేదిక ఆధారంగా కేసును విచారణ చేస్తామని వారు తెలిపారు. మృతదేహాలను గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. దీనిపై ఇప్పటికే పోలీసులు విచారణ చేపట్టారు.

మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారిని తీసుకువచ్చి మృతదేహాలను గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన వారి శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మహబూబ్​సాగర్​ చెరువులో మృతదేహం లభ్యం

అనుమానాస్పద స్థితిలో యువకుడి ఆత్మహత్య - మృతికి అదే కారణమా? - YOUNG MAN SUICIDE In gundala mandal

ABOUT THE AUTHOR

...view details