ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"పవన్‌ కల్యాణ్‌ను చంపేస్తాం" - డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్ - THREATENING CALL TO PAWAN KALYAN

పవన్‌కల్యాణ్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్ - అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ సందేశాలు

threatening_call_to_pawan_kalyan
threatening_call_to_pawan_kalyan (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2024, 6:18 PM IST

Updated : Dec 9, 2024, 8:32 PM IST

Threatening call to Deputy CM Pawan Kalyan Office:డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి నుంచి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ ఆగంతకుడు సందేశాలు పంపించాడు. పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్‌, సందేశాలను పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులకు సైతం సమాచారం అందించారు. పవన్‌ కల్యాణ్‌ పేషీకి బెదిరింపు కాల్స్‌పై హోంమంత్రి అనిత డీజీపీ ద్వారకా తిరుమలరావుతో మాట్లాడారు. ఆగంతుకుడి నుంచి పవన్‌ కల్యాణ్ పేషీకి రెండుసార్లు కాల్స్ వచ్చాయని అనితకు డీజీపీ వివరించారు.

నిందితుడి కోసం గాలింపు చర్యలు:బెదిరింపు కాల్స్​పై రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పేషీకి 950550556 నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో కూడా హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ నెంబరు మల్లిఖార్జున రావు అనే వ్యక్తి పేరు మీద ఉంది. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

పవన్​కు ఫోన్​ చేసిన మల్లిఖార్జునరావు (ETV Bharat)
Last Updated : Dec 9, 2024, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details