Thousands Of Unlit Street Lights In Visakhapatnam : జగన్ ప్రభుత్వంలో సాగిన నిర్లక్ష్యం విశాఖవాసులకు నేటికీ శాపంగా మారింది. నగరంలో వీధి దీపాలు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో వార్డుల్లో తలెత్తుకోలేక కాంట్రాక్టర్లు మార్చాలంటూ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు.
చంద్రబాబు ముందుచూపు :హుద్‌హుద్ తుపాన్ (2014) సమయంలో విశాఖను పునఃనిర్మించే క్రమంలో నాటి సీఎం చంద్రబాబు ముందు చూపుతో ఆలోచించారు. విశాఖలో రూ.85 కోట్లతో 85 వేలకు పైగా ఎల్‌ఈడీ (LED) వీధి దీపాలను ఏర్పాటు చేశారు. ఏడేళ్ల పాటు ఈఈఎస్‌ఎల్‌కు(EESL) నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేశారు. జీవీఎంసీ (GVMC) ఏడాదిన్నరపాటు కాంట్రాక్టర్లును నియమించలేదు. ఈ మధ్యనే ఓ సంస్థకు అప్పగించినా నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది.
మహారాజ ఆసుపత్రికి మహర్దశ - హర్షం వ్యక్తం చేస్తున్న రోగులు - Good Facilities on Hospital
మొదటి నోటీసు విషయం కమిషనర్‌కు తెలియదా? : కాంట్రాక్టర్లు నిర్వహణలో 95 శాతం వీధి దీపాలు ప్రతిరోజూ వెలగాలి. అలా జరగని పక్షంలో వీధిదీపం ఆరిపోయిన 24 గంటల తర్వాత ప్రతి రోజుకు రూ.50 చొప్పున అపరాధ రుసుం విధించాలి. ఈ క్రమంలో కాంట్రాక్టర్లు బిల్లులో కోత విధించాలి. కానీ అధికారులు కాంట్రాక్టర్లుపై చర్యలు తీసుకోలేదు. మరమ్మతుల నిమిత్తం 400 మంది కార్మికులను కాంట్రాక్టర్లు నియమించుకోవాలి. కేవలం 150 మందితో నడిపిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కొందరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల అండతోనే కాంట్రాక్టర్లుపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది.