Things Should Not Keep In Fridge :ఇంట్లో మనం రోజూ వంట చేసుకుంటాం. కానీ వచ్చిన చిక్కేమిటంటే కొన్ని ఆహార పదార్థాలు మిగిలిపోతుంటాయి. వాటిని పడేయలేక రిఫ్రిజిరేటర్లో పెట్టేస్తాం. కానీ ఫ్రిజ్‌ను వీలైనంత తక్కువ వాడమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా ఏం చెబుతున్నారంటే
- కూరగాయలు, పండ్లు తాజాగా ఉన్నవి చూసి కొనండి. ఎక్కువ కొని ఫ్రిజ్‌లో ఉంచారంటే అందులో ఉండే పోషకాలు క్రమంగా తగ్గిపోతాయి.
- వండిన కూరలు తాజాగా తినడం ఉత్తమం. మిగిలిన కూరలను మర్నాడు తింటే పరవాలేదు. మూడు రోజులు గనుక నిల్వ ఉంచారంటే అది విషతుల్యమవుతుంది. మసాలా కూరలు, సలాడ్స్ అలా ఉంచితే మరీ ప్రమాదకరం.
- పాలు, చీజ్ లాంటి హై ప్రొటీన్ ఉన్న పదార్థాలకు బ్యాక్టీరియా వేగంగా చేరే అవకాశం ఉంది. అందువల్ల వాటిని వెంటనే ఉపయోగించాలి.
- పచ్చి మాంసం, చేపలు, రొయ్యలు లాంటివి నిల్వ ఉంచి తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది.
- అన్నం, పాస్తా, దుంపలు లాంటివి రిఫ్రిజిరేటర్లో పెట్టకూడదు.
- మర్నాడు పని సులభమవుతుందని కూరగాయలను కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచినా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది.
- ఒకేసారి పనైపోతుంది కదా అని చెప్పి ఎక్కువ పరిమాణంలో కూరగాయలు, పండ్లు కొనకుండా అవసరమైనంత మేరకే కొనటం అలాగే ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి వంటచేయటం అలవాటు చేసుకుంటే పండ్లూ పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచనవసరం ఉండదు.