The Youth Set Up A Cricket Ground On The Sand AT Vijayawada:భారతదేశంలోని క్రీడలన్నింటిలో క్రికెట్‌కు ప్రత్యేక స్థానం ఉంటుందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దిల్లీ నుంచి గల్లీ వరకు ఈ క్రికెట్ ఎంతో ఆదరణను చూరగొంది. ప్రధానంగా యవతీ యువకులు ఎక్కడ చూసినా క్రికెట్‌ను ఇష్టంగా ఆడుతూ ఉంటూ ఉంటారు. కానీ విజయవాడలోని కృష్ణా నది వద్ద యువత అందుకు భిన్నంగా ఇసుకపై మైదానాన్ని ఏర్పాటు చేసుకుని ఆడుతున్నారు. వివరాల్లోనికి వెళ్తే..
ఇసుకలో క్రికెట్ ఆడుతున్న యువత: క్రికెట్‌పై మక్కువ ఉన్న యువతకు వచ్చిన ఆలోచన ఏకంగా ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నది వారధి దిగువన ఉన్న ఇసుక తిన్నెల్లో క్రికెట్ మైదానాన్ని సిద్ధం చేసింది. ఇసుకలో బంతి వేసేందుకు వీలు కుదరక మట్టిపై మొదట్లో పిచ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణా నదికి వరద వచ్చి ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు విడిచి పెట్టిన ప్రతిసారి మట్టి పిచ్ కొట్టుకుపోతుండడంతో ఏకంగా వారే సొంత ఖర్చుతో కాంక్రీట్‌తో నది మధ్యలో చిన్న పిచ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు బంతి సిమెంట్ పిచ్‌పై వేసేందుకు సిద్ధంగా ఉంటోంది. బ్యాటర్లకు కాస్త సులువుగా ఉన్నప్పటికీ ఫీల్డర్లు మాత్రం చెమటోడ్చాల్సి వస్తోంది.