తెలంగాణ

telangana

ETV Bharat / state

నా పెళ్లాన్ని నాకు దూరం చేస్తారా? - కోపంతో యువతి తల్లిదండ్రులను చంపిన యువకుడు - YOUNG MAN KILLS LOVER PARENTS - YOUNG MAN KILLS LOVER PARENTS

Man Killed Girlfriend's Parents : ఓ యువకుడు తన ప్రియురాలి కుటుంబ సభ్యులపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కత్తితో పొడిచి, గొంతు కోసి అమ్మాయి తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. ఈ ఉదంతం వరంగల్​ జిల్లాలో జరిగింది.

Man Attacked On Lover Family
Man Attacked On Lover Family (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 9:03 AM IST

Updated : Jul 11, 2024, 11:30 AM IST

Young Man Killed Girlfriend Parents in Warangal :ప్రేమ వివాహాన్ని కాదన్నారనే కారణంగా ఓ యువకుడు ఉన్మాదిగా మారి యువతి తల్లిదండ్రులపై విచక్షణా రహితంగా దాడిచేసి హతమార్చాడు. ఈ అమానవీయ ఘటన వరంగల్​ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో అమ్మాయి తల్లి అక్కడిక్కడే మృతి చెందగా, తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Knife Attack In Warangal :చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో దారుణం చోటు చేసుకుంది. సమీప గ్రామానికి చెందిన మేకల బన్నీ అనే యువకుడు తాను ప్రేమించిన ప్రియురాలి కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఆ దాడిలో అమ్మాయి తల్లి సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి శ్రీనివాస్ నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఆ ఘటనలో అమ్మాయితోపాటు సోదరుడు మదన్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దంపతులిద్దరూ చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంబానోతు శ్రీను సుగుణ దంపతుల కుమార్తె అయిన దీపిక, గూడూరు మండలం గుండెంగకి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులను కాదని గతేడాది నవంబర్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయి ఎవ్వరికీ తెలియకుండా వివాహం చేసుకున్నారు. జనవరిలో యువతి తల్లిదండ్రులు పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించారు. పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం ఆ యువతిని తల్లిదండ్రులతో పంపించారు. అప్పటి నుంచి యువతి ఇంటి వద్దే ఉంటూ హనుమకొండలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే సమాచారం తెలుసుకున్న బన్నీ ఉన్మాదిగా మారాడు.

అర్ధరాత్రి యువతి ఇంటికి వచ్చి దాడికి పాల్పడి :ఈ క్రమంలోనే దీపికతో పాటు వారి తల్లిదండ్రులు శ్రీనివాస్, సుగుణపై నాగరాజు కక్ష పెంచుకున్నాడు. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలుసుకున్న బన్నీ, బుధవారం అర్ధరాత్రి కత్తితో దీపిక ఇంటికి వచ్చి యువతి తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. విచక్షణరహితంగా కత్తితో పొడిచి ఇద్దరినీ హత్య చేశాడు. అడ్డువచ్చిన వారిని కత్తితో బెదిరించి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి తర్వాత అక్కడ నుంచి పరారైన నిందితుడు బన్నీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

" కొన్నాళ్ల క్రితం యువతీ యువకులిద్దరూ ప్రేవించుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి నిందితుడు తండాకు చాలా సార్లు వచ్చేవాడు. ఆ క్రమంలోనే యువతి కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరిస్తుండేవాడు. తాజాగా యువతి తల్లిదండ్రులపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. నేను కట్టె పట్టకుని నిలబడే సరికి వెళ్లిపోయాడు"-ప్రత్యక్ష సాక్షి

ప్రేమ పేరుతో యువతి కుటుంబంపై దాడి - ప్రతిఘటనలో ప్రేమోన్మాది మృతి

ప్రేమించలేదని యువతిని నరికి చంపిన ప్రేమోన్మాది - ఆపై అదే కత్తితో తానూ! - Boyfriend Killed His Girlfriend

Last Updated : Jul 11, 2024, 11:30 AM IST

ABOUT THE AUTHOR

...view details