Police Interrogated Few Who Attended Janwada Party :జన్వాడ ఫాంహౌస్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఫాంహౌస్‌లో పార్టీకి హాజరైన వారిలో కొందరిని పోలీసులు విచారించారు. మరికొంత మంది సాక్షులను త్వరలో విచారించనున్నారు. ఇప్పటికే విజయ్ మద్దూరి బ్లడ్ శాంపిల్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించిన మోకిలా పోలీసులు నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకోనున్నారు
ఒక్కరికి డ్రగ్స్ పాజిటివ్ :జన్వాడలోని రాజ్‌పాకాల ఫామ్‌హౌస్‌లో పార్టీ నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు తెలవగా పోలీసులు తనిఖీలు చేశారు. పార్టీలో పాల్గొన్న 24 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, విజయ్ మద్దూరి అనే వ్యక్తికి కొకైన్ తీసుకున్నట్లు తేలింది. దీంతో ఎస్‌డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనిఖీల్లో పోలీసులు కర్ణాటక, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
'డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎవరు సరఫరా చేశారు?' - జన్వాడ ఫామ్‌హౌస్ కేసులో విజయ్ మద్దూరి విచారణ
ఈ కేసులో ఏ1గా కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల, ఏ2గా విజయ్ మద్దూరిని చేర్చినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపారు. అయితే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విజయ్‌ను పోలీసులు విచారించారు. ఎవరి దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారని ప్రశ్నించినట్లు తెలిసింది. దీపావళి సందర్భంగా నిర్వహించిన ఈ పార్టీలో తన వద్ద ఉన్న డ్రగ్స్‌ను పార్టీలో వినియోగించాలని రాజ్ పాకాల ప్రోత్సహించినట్లు విజయ్ మద్దూరి అంగికరించినట్లు పోలీసులు తెలిపారు.
నివేదిక ప్రకారం చర్యలు :పోలీసుల విచారణ అనంతరం ఆయన మోకిలా పోలీసుల ఎదుట హాజరయ్యారు. పార్టీలో మాదకద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు సరఫరా చేసింది ఎవరు? ఇప్పటివరకు ఎన్నిసార్లు డ్రగ్స్ తీసుకున్నారు? అనే కోణంలో పోలీసులు విజయ్ మద్దూరిని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై దర్యాప్తు చేస్తున్న మోకిలా పోలీసులు పార్టీకి హాజరైన కొందరిని విచారించారు. మరికొంతమంది సాక్షులను త్వరలో విచారించనున్నారు. సాక్షుల విచారణ అనంతరం దీనిపై పూర్తిస్థాయిలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయనున్నారు. వీలైనంత త్వరగా సాక్షులను విచారించాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆ తరువాతే పోలీసుల కార్యచరణపై స్పష్టత రానుంది.
జన్వాడ ఫామ్ హౌస్ కేసు - 7గంటల పాటు రాజ్ పాకాల విచారణ
జన్వాడ ఫామ్‌హౌజ్ కేసు - కొకైన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై పోలీసులు ఆరా!