తెలంగాణ

telangana

ETV Bharat / state

3 నెలల్లో బీసీ కులగణన చేయండి - ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - caste census in Telangana - CASTE CENSUS IN TELANGANA

Telangana HC on Caste Census : బీసీ కులగణనపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. మూడు నెలల్లోగా కులగణన పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

Telangana HC on Caste Census
Telangana HC on Caste Census (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 2:25 PM IST

Updated : Sep 10, 2024, 4:06 PM IST

Telangana HC on Caste Census :బీసీ కులగణన 3 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కులగణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించింది. బీసీ కులగణన చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్​ను ఎర్ర సత్యనారాయణ అనే వ్యక్తి 2019లో ఫైల్ చేశారు.

కాగా ఈ పిటిషన్​పై సీజే ధర్మాసనం ఇవాళ (సెప్టెంబరు 10వ తేదీ 2024) మరోసారి విచారించింది. బీసీ కులగణనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నాయని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకురాగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం మూడు నెలల్లో కులగణన చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పిటిషన్​పై విచారణ ముగించింది.

కులగణనను సమర్థంగా నిర్వహిస్తాం :బీసీ కులగణన ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్​ నిరంజన్ హర్షం వ్యక్తం చేశారు. కుల గణనను బీసీ కమిషన్ సమర్థంగా నిర్వహిస్తుందని తెలిపారు. కమిషన్ ఛైర్మన్​గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నాంపల్లిలోని యూసఫియన్ బాబా దర్గాలో నిరంజన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బీసీ కమిషన్​కు మంచి పేరు వచ్చేలా పని చేసేందుకు యూసఫియన్ బాబా స్థైర్యం ఇవ్వాలని ప్రార్థించినట్లు వెల్లడించారు.

ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం సరైనదే : హైకోర్టు - TG HC on Bhoodan Yagna Board

ఏడాదిగా ఏం చేస్తున్నారు - చివరి క్షణంలో కోర్టుకు వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తే ఎలా? : హైకోర్టు - High Court On Ganesh Impression

Last Updated : Sep 10, 2024, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details