తెలంగాణ

telangana

ETV Bharat / state

బీఆర్​ఎస్​ పార్టీకి గుడ్​బై చెప్పిన తాటికొండ రాజయ్య - కేసీఆర్​కు రాజీనామా లేఖ - Thatikonda Rajaiah latest news

Thatikonda Rajaiah Comments on BRS Party : స్టేషన్ ఘన్​పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్​ఎస్​ను వీడారు. ఈ మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడిస్తూ, లేఖను అధినాయకత్వానికి పంపారు. పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నానని, తనకు గుర్తింపు లేదని రాజయ్య అంతకుముందు వాపోయారు.

Thatikonda Rajaiah Comments on BRS Party
Thatikonda Rajaiah Comments

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 11:13 AM IST

Updated : Feb 3, 2024, 2:29 PM IST

బీఆర్​ఎస్​లో మానసిక క్షోభకు గురయ్యా - పార్టీ విధానాలు ఏమాత్రం నచ్చట్లేదు : తాటికొండ రాజయ్య

Thatikonda Rajaiah Comments on BRS Party : బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తాటికొండ రాజయ్య ప్రకటించారు. రాజీనామా లేఖను కేసీఆర్​కు పంపించారు. పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నానని, తనకు గుర్తింపు లేదని రాజయ్య వాపోయారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ నాయకుల వ్యాఖ్యలు సరికావని అభిప్రాయపడ్డారు.

మార్పు అంటే ఇదేనా? తెలంగాణ ప్రయోజనాలు కేంద్రం చేతిలో పెట్టడమా : హరీశ్‌రావు

Ex Mla Rajaiah Thatikonda Resign To BRS Party: జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తాటికొండ రాజయ్య ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్​లో చేరనున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో గత ఆరునెలలుగా జరుగుతున్న పరిణామాలు తనను, తన అనుచరవర్గాన్ని మానసిక వేదనకు గురి చేశాయని రాజయ్య చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ నాయకులు అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన పోరాటం చేయాలేమా అని ప్రశ్నించారు. తన మద్దతుదారులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి - సీఎం రేవంత్​కు కేటీఆర్ బహిరంగ లేఖ

"బీఆర్ఎస్​లో మానసిక క్షోభకు గురయ్యా. పార్టీలో నాకు సరైన గుర్తింపు లభించడం లేదు. పార్టీ అధినాయకత్వాన్ని కలిసే అవకాశమే దక్కడం లేదు. కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉంది. వారితో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటా. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలుస్తామనడం సరికాదు. నేను 15 ఏళ్లు కాంగ్రెస్‌లోనే ఉన్నాను. కాంగ్రెస్‌లో ఉండి తెలంగాణ కోసం పోరాడా." తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

Thatikonda Rajaiah Comments on BRS :ఆది నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో ఉప్పూ నిప్పుగా ఉన్న రాజయ్య ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కాదని కడియం కు టిక్కెట్ ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు.అప్పుడే పార్టీ వీడేందుకూ సిద్ధమయ్యారు. కడియం శ్రీహరితో ఎడముఖం పెడముఖం ఉండడమే కాకుండా నారు పెట్టి నీరు పోసి పెంచి పంట పెద్దది చేశాక వేరేవారు కోసుకుపోతే చూస్తూ ఊరుకుంటామా అంటూ నియోజకవర్గ సమావేశాల్లో మాట్లాడుతూ తాను కడియంకు మద్దతిచ్చేది లేదని చెప్పేశారు.

Ex Mla Rajaiah Thatikonda Resign To BRS :దీంతో ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగకూడదని భావించి ఇరువురు నాయకులు కలసి పనిచేయాలంటూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సయోధ్య కుదర్చారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాలను అనుసరించి ఎన్నికల్లో పనిచేసినా రాజయ్యలో మాత్రం అసంతృప్తి తగ్గలేదు. మారిన రాజకీయ పరిస్ధితుల్లో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సన్నద్ధమైయ్యారు. తన వేదన చెప్పుకునే అవకాశం పార్టీ ఇవ్వలేదని రాజయ్య చెప్పారు. కాంగ్రెస్​లో ఎంతో మందితో పరిచయం ఉన్నాయని గతంలో సోనియాగాంధీ ఆధ్వర్యంలోనే తాను కాంగ్రెస్​లో చేరానని చెప్పారు. రాజయ్య నిర్ణయమేదైనా తాము ఆయన వెంటే ఉంటామని మద్దుతదారులు అంటున్నారు.

తెలంగాణలోనూ ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ - ఆదివారం రాష్ట్ర మంతివర్గం కీలక సమావేశం

మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే మా ఉద్దేశం- నాగోబా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి

Last Updated : Feb 3, 2024, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details