TGSRTC Suspended Employees Request to CM and RTC MD:తప్పు చేశాం సార్ క్షమించండి. మా కుటుంబం దీనావస్థలో ఉంది. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. తిరిగి ఉద్యోగంలోకి తీసుకోండి అంటూ టీజీఎస్ ఆర్టీసీలో సస్పెండ్, తొలగించబడిన ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్లను వేడుకుంటున్నారు. తెలియకుండా తప్పులు జరిగాయంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
చిన్న చిన్న కారణాలతో తమను ఉద్యోగం నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం పోయిన తరువాత కుటుంబ పోషణ భారమైందని దీన స్థితిలో ఉన్నామని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమను తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకుని తమ కుటుంబాలకు అండగా నిలవాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు.
బస్సు నడిపేవారు లారీ ఎక్కుతూ:తొలగించబడిన ఆర్టీసీ ఉద్యోగులు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తిరిగి తమకు ఉద్యోగం కల్పించాలని అధికారులను వేడుకుంటున్నారు. ఏదో తప్పు జరిగిపోయిందని పాశ్చత్తాప పడుతున్నామని, మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఇందుకోసం ఆయా డిపోలు, బస్ భవన్‌తో పాటు ఆర్టీసీ ఎండీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ వేడుకుంటున్నారు. తమ కుటుంబాలు ఆర్థికంగా బాగోలేవని, బస్సు నడిపే తన భర్త లారీ నడుపుతున్నారని ఓ డ్రైవర్ భార్య వాపోయారు.
జగన్ అసెంబ్లీకి రారని పందేలు నడుస్తున్నాయి - 10మంది ఎమ్మెల్యేలూ సహకరించట్లేదు : అనిత