TGSRTC Reduced Fare For Ac Buses :ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఇది గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు. అన్ని ఏసీ బస్సుల టిక్కెట్లపై 10 శాతం తగ్గించినట్లు గా రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ఏసీ బస్సుల బేసిక్ ఛార్జ్‌పై ఫ్లాట్ 10శాతం తగ్గించినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఈ ఆఫర్ ఏసీ స్లీపర్, ఏసీ సీటర్-స్లీపర్, రాజధాని బస్సుల్లో నేటి నుంచి అందుబాటులోకి వచ్చిందని యాజమాన్యం తెలిపింది.
ప్రజలకు ఉన్నత స్థాయి ప్రయాణాన్ని మరింత అందుబాటులో తీసుకురావడం, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించడంలో భాగంగా ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టినట్లుగా ఆర్టీసీ వెల్లడించింది. ప్రయాణికులు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని తగ్గింపు ఛార్జీలతో ప్రయాణించాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. మరిన్ని వివరాలకు www.tgsrtcbus.in టీజీఎస్ ఆర్టీసీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలత పేర్కొన్నారు.