తెలంగాణ

telangana

ETV Bharat / state

అది పూర్తిగా ఎడిటెడ్ వీడియో - ఆర్టీసీ ప్రతిష్ఠ దిగజార్చే ప్రయత్నం చేస్తే చర్యలు పక్కా : టీజీఎస్​ఆర్టీసీ ఎండీ - Bus Stunt Viral Video

TGSRTC MD Sajjanar Respond Bus Stunt Video : రీల్స్​ కోసం ఓ వ్యక్తి ఏకంగా నడిరోడ్డుపై రన్నింగ్​ బస్సు కింద పడుకున్నట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమంలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోలో అతను చేసిన స్టంట్​ నిజం కాదని, పూర్తిగా ఎడిటెడ్​ చేసిందని టీడీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ వెల్లడించారు. సోషల్ మీడియాలో పాపులర్​ అయ్యేందుకు కొందరు ఇలా వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారని, ఆర్టీసీ ప్రతిష్ఠ దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని సజ్జనార్​ సీరియస్​ అయ్యారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు.

TGSRTC MD Sajjanar Serious on Bus Stunt Viral Video
TGSRTC MD Sajjanar Respond Bus Stunt Video (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 10:45 PM IST

TGSRTC MD Sajjanar Serious on Bus Stunt Viral Video :ఏమైనా చేద్దాం, కానీ వైరల్​ అయిపోదామనుకుంటూ కొందరు ఆకతాయిలు సోషల్​ మీడియాలో చేస్తున్న పిచ్చి చేష్టలకు హద్దూపద్దూ లేకుండా పోతుంది. అటువంటి ఓ యువకుడు చేసినట్లు వస్తున్న బస్సు స్టంట్​ వీడియోనే ఇప్పుడు సామాజిక మాధ్యమంతటా తెగ వైరల్​గా మారింది. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు కింద ఒక వ్యక్తి పడుకుంటాడు.

బస్సు సాఫీగా అతడి పైనుంచి వెళుతుంది. కానీ అతడికి ఏ ప్రమాదం సంభవించదు. అతడు తాపీగా లేచి నడుచుకుంటూ వెళతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ వీడియో ఫేక్‌ అని, పూర్తిగా ఎడిటెడ్ చేసిన వీడియోను కొందరు వైరల్ చేస్తున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు అని ఆయన హితవు పలికారు.

Bus Stunt Fake Viral Video : చిత్ర విచిత్రాలతో కొందరు ఆకతాయిలు చేస్తోన్న ఈ రీల్స్ లైక్​లు, కామెంట్ల కోసం తప్ప, ఇంకేమీ రాదు. ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉందన్నారు. సరదా కోసం చేసే ఎడిటెడ్‌ వీడియోలు ఇతరులకు ప్రాణాపాయం కూడా కలిగిస్తాయని టీజీఎస్ఆ​ర్టీసీ ఎండీ సజ్జనార్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంటోందని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

"సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ వీడియో ఫేక్‌. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్‌ మీడియాలో పాపులర్‌ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్‌ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్​లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉంది. సరదా కోసం చేసే ఎడిటెడ్‌ వీడియోలు ఇతరులకు ప్రాణాప్రాయం కూడా కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలను #TGSRTC యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంటోంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది."-వీసీ సజ్జనార్, టీజీఎస్​ఆర్టీసీ ఎండీ ఎక్స్​ పోస్ట్​

పార్సిల్​లో షాకింగ్ ఐటెమ్- ప్రొడక్ట్​తోపాటు 'పాము' డెలివరీ- చిప్స్ ప్యాకెట్​లో కప్ప! - Snake In Amazon Package

మహిళపై తీవ్రంగా దాడి చేసిన గేదె- కొమ్ములతో రోడ్డుపై ఈడ్చుకెళ్లి! - Buffalo Attack Video

ABOUT THE AUTHOR

...view details