తెలంగాణ

telangana

ETV Bharat / state

దూరప్రాంత ప్రయాణికులకు టీజీఎస్​ఆర్టీసీ గుడ్​ న్యూస్​ - నేటి నుంచే పికప్​ వ్యాన్ సౌకర్యం - TGSRTC PICKUP VANS START

టీజీఎస్​ఆర్టీసీ పికప్​ వ్యాన్ల సౌకర్యం - నేటి అమల్లోకి టీజీఎస్​ఆర్టీసీ పికప్​ వ్యాన్లు - ముందస్తు బుకింగ్​తో సాఫీ ప్రయాణం

tgsrtc
tgsrtc (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2024, 7:35 PM IST

Updated : Dec 6, 2024, 7:47 PM IST

TGSRTC Pickup Vans : నగరంలో ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్​ఆర్టీసీ వినూత్న ఆలోచన చేసింది. టీజీఎస్​ఆర్టీసీ దూర ప్రాంత ప్రయాణికుల కోసం పికప్​ వ్యాన్​లను ఏర్పాటు చేయనుంది. ఇది ఇవాళ్టి నుంచే అమలులోకి రానుంది. ఈసీఐఎల్​ నుంచి ఎల్బీనగర్​ వరకు మధ్య ఉన్న ప్రాంతాల నుంచి పికప్​ వ్యాన్​ సౌకర్యం రానుంది. విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, కందుకూరు రూట్లలో వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ పికప్​ వ్యాన్​లను ఏర్పాటు చేయనున్నారు.

ఈ పికప్​ వ్యాన్లు ఈసీఐఎల్​ కాప్ర మున్సిపల్​ కాంప్లెక్స్​, మౌలాలీ హెచ్​బీ కాలనీ, మల్లాపూర్​ బస్టాప్​, హెచ్​ఎంటీ నగర్​, నాచారం బస్టాప్​, హబ్సిగూడ బస్టాప్​, ఉప్పల్​ మెట్రో స్టేషన్​, నాగోల్​-సుప్రజ ఆసుపత్రి, ఎల్​బీ నగర్​ ఎల్​పీటీ మార్కెట్​

ఈ విధంగా ముందస్తు బుకింగ్​ :ప్రయాణికులు ముందస్తు టికెట్లను బుక్​ చేసుకునేందుకు www.tgsrtcbus.in లో బుక్ చేసుకోవాలి. అలాగే సమీప ఏటీబీ ఏజెంట్ల వద్ద గానీ, ఎంజీబీఎస్​, జేబీఎస్​, దిల్​సుఖ్​నగర్​ బస్​ స్టేషన్లలో సీట్లు బుక్​ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలకు 04069440000, 04023450033 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆర్టీసీ యాజమాన్యం సూచించింది.

Last Updated : Dec 6, 2024, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details