Mahalakshmi Scheme in Telangana :మహాలక్ష్మి పథకంతో, మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి అనూహ్య స్పందన లభిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 40 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసినట్లు అర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు రూ.1,800 కోట్ల రూపాయలను మహిళలు ఆదా చేసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాల్లో తిరిగే బస్సులకు ఒకే డోర్ ఉంటుంది. కానీ, గ్రేటర్ హైదరాబాద్‌లోని సిటీ బస్సుల్లో రెండు డోర్లు ఉంటాయి.
బస్సు ఛార్జీలు పెంచలేదు - తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ముందు భాగం నుంచి మహిళలు, వెనక భాగం నుంచి పురుషులు ఎక్కుతుంటారు, దిగుతుంటారు. కానీ, మహాలక్ష్మి పథకం ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో మహిళల సంఖ్య భారీగా ఉంటుంది. దీంతో బస్సుల్లో ఎక్కే ప్రయాణికుల్లో సింహభాగం మహిళలే ఉంటున్నారు. ముందు ద్వారం, వెనక ద్వారం రెండింటి నుంచి మహిళలు ఎక్కడం, దిగడం వల్ల పురుష ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. పైగా టిక్కెట్ కొనుక్కుని ప్రయాణిస్తున్న తమకు, దిగే అవకాశం లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
దీంతో పాటు కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరిగినట్లు డ్రైవర్లు, కండక్టర్లు పేర్కొంటున్నారు. మహిళలకు, పురుషులకు ఎవ్వరికి ఇబ్బందులు కలగకుండా గ్రేటర్ ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందు ద్వారం వద్ద మహిళల ఫోటో, వెనక ద్వారాల వద్ద పురుషుల ఫోటోతో పెయింట్ వేశారు. ఎవరికి కేటాయించిన ద్వారం నుంచి వాళ్లే ఎక్కాలని కండక్టర్లు సైతం పదేపదే ప్రయాణికులకు చెబుతున్నారు. దీంతో ఎవరికి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగిపోతుందని డ్రైవర్లు, కండక్టర్లు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. బస్సులోకి ప్రవేశించే సమయంలో, దిగే సమయంలో కూడా పదేపదే చెప్పడంతో ప్రమాదాలు జరగకుండా నివారించగలుగుతున్నామని పేర్కొంటున్నారు.
"స్త్రీలు ముందువైపు నుంచి బస్సులోకి ఎక్కాలని, పురుషులు వెనుకవైపు నుంచి బస్సు ఎక్కాలని సూచిస్తూ స్టిక్కర్లు ఏర్పాటు చేశాము. ఇంతకు ముందు కొందరు మహిళలు వెనుకవైపు నుంచి బస్సులోకి ఎక్కబోయి కిందపడ్డారు. తీవ్రంగా గాయాలయ్యాయి. అందుకే ఇటువంటి ప్రమాదం చోటుచేసుకోకుండా ఉండేందుకు, ఉన్నతాధికారులు అధికారులు స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు". - కండక్టర్, టీజీఆర్టీసీ
ఆర్టీసీ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం - TGSRTC ITI COURSE ADMISSION 2024
మెట్రో లేని ప్రాంతాల్లో 10 నిమిషాలకో ఆర్టీసీ బస్సు - ప్రయోగాత్మకంగా ఈ మార్గాల్లో అమలు - RTC Routes Bus Extended in Hyd