How to Apply for TG Gurukul schools 2025 -26:రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే.. గతంలో 5 తరగతికి ఒకసారి, 6 నుంచి 9 తరగతుల్లో అడ్మిషన్లకు మరోసారి దరఖాస్తులను స్వీకరించేవారు. ఎంట్రన్ టెస్ట్‌ను సైతం వేర్వేరు తేదీల్లో నిర్వహించే వారు. కానీ.. ఈ ఏడాది ఐదు నుంచి తొమ్మిది క్లాస్‌లకు ఒకేసారి దరఖాస్తుల స్వీకరణ, అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. మరి ఈ ప్రవేశాల కోసం ఏఏ డాక్యుమెంట్లు కావాలి? ఎలా అప్లై చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చివరి తేదీ అప్పుడే: 2024 డిసెంబరు 21వ తేదీ నుంచి గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 1వ తేదీ లాస్ట్. 23 ఫిబ్రవరి 2025న ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన పత్రాలివే :
- ప్రస్తుతం చదువుతున్న స్కూల్ నుంచి బోనఫైడ్ లేదా బర్త్ సర్టిఫికెట్
- ఆధార్ కార్డు
- సెల్‌ఫోన్ నెంబరు
- విద్యార్థి పాస్‌ఫొటో
- ఇన్కమ్ సర్టిఫికెట్(గ్రామీణ ప్రజల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రజలైతే వారి వార్షిక ఆదాయం రూ.2లక్షల లోపు మాత్రమే ఉండాలి).
విద్యార్హత:విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో నాలుగో తరగతి 2024-25 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య.. ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం ఇదే:
- ముందుగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.https://tgcet.cgg.gov.in/TGCETWEB/#/home
- దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ముందుగా పేమెంట్ పూర్తి చేసి పేమెంట్ Acknowledgement నెంబర్ పొందాలి. అందుకోసం హోమ్ పేజీలో ముందుగా Payment Link పై క్లిక్ చేయాలి.
- క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ మీద బాక్స్‌లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Get OTP ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఆ ఓటీపీ ఎంటర్ చేసి Submit OTPపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ మీద పలు వివరాలు కనిపిస్తాయి.
- ఆ వివరాలు ఎంటర్ చేయాలి. అంటే మీరు ఏ క్లాస్‌కు అప్లై చేస్తున్నారు అనే తదితర వివరాలు ఎంటర్ చేయాలి. అలాగే బర్త్ సర్టిఫికెట్‌ను అప్లోడ్ చేయాలి.
- ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, డిక్లరేషన్ బాక్స్‌లో టిక్ చేసి Proceed ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం మీరు పేమెంట్ చేయాలి. మీకు స్క్రీన్ మీద పేమెంట్ Acknowledgement నెంబర్ కనిపిస్తుంది. దానిని సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే అప్లై చేయడానికి ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్.
- ఇప్పుడు అప్లై చేసుకోవాలి. ఇందుకోసం హోమ్ పేజీలో Payment Link కింద Application Link ఉంటుంది. దానిని క్లిక్ చేయాలి.
- తర్వాత అక్కడ మీరు పేమెంట్ Acknowledgement నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత పాస్‌పోర్ట్ ఫొటోను అప్లోడ్ చేయాలి. డిక్లరేషన్ బాక్స్‌లో టిక్ చేసి క్యాప్చా వివరాలు ఎంటర్ చేసి Next ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు స్క్రీన్ మీద మీ పేరు, Acknowledgement నెంబర్ కనిపిస్తాయి. మరి కొన్ని వివరాలు ఎంటర్ చేసి Next పై క్లిక్ చేయాలి.
- అనంతరం మీరు ఏ స్కూల్లో చదవాలనుకుంటున్నారో ఆ స్కూల్స్ లిస్ట్‌ను ప్రయారిటీ వైజ్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం Next ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీరు ఎగ్జామ్ సెంటర్స్ సెలక్ట్ చేసుకుని మిగిలిన వివరాలు ఎంటర్ చేసి Next పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత Preview ఓపెన్ అవుతుంది. మీ అప్లికేషన్‌కు సంబంధించి అన్ని వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
- ఆ వివరాలు అన్ని ఒకసారి వెరిఫై చేసుకుని సబ్మిట్ చేస్తే మీ దరఖాస్తు ఓకే అయినట్లు కనిపిస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.
Acknowledgement నెంబర్‌ను సేవ్ చేసుకోవడం మర్చిపోతే..?
ఒకవేళ మీరు పేమెంట్ పూర్తి చేసిన తర్వాత Acknowledgement నెంబర్‌ను సేవ్ చేసుకోవడం మర్చిపోతే ఆ నెంబర్‌ను కూడా కనుక్కొనే ఆప్షన్ ఉంది. అందుకోసం..
- ముందుగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.https://tgcet.cgg.gov.in/TGCETWEB/#/home
- హోమ్ పేజీలో Know Your Payment Acknowledgement Numberపై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం మీ పేరు, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Get OTPపై క్లిక్ చేసే ఓటీపీ వస్తుంది.
- దానిని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ Payment Acknowledgement Number స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ వివరాలు సేవ్ చేసుకోవాలి.
రేషన్ కార్డులో కొత్త పేర్లు యాడ్ చేయాలా? - ఇలా ఈజీగా చేసేయండి!
ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ - ఒక్క క్లిక్‌తో మీ దగ్గరలోని ఆసుపత్రుల లిస్టు తెలుసుకోండి!