ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పది నాణేనికి పెద్ద కష్టం - అవి చెల్లవన్న అపోహతో అసలు సమస్య! - 10 Rupees Coin Problems - 10 RUPEES COIN PROBLEMS

10 Rupees Coin Problems : దేశీయ కరెన్సీలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. నాణేలు, నోట్లలో విభిన్నమైన మార్పులు వచ్చాయి. అయితే అలా ప్రవేశపెట్టిన పది రూపాయల నాణెంపై పలు సందేహాలు, అనుమానాలు వ్యాపించాయి. ఆ నాణెం చెల్లదనే అపోహ ప్రజల్లోకి వెళ్లింది. దీంతో ఎక్కడికి వెళ్లినా 10 రూపాయల కాయిన్ తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. మరోవైపు వీటిపై నెలకొన్న అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసేందుకు బ్యాంకర్లు, ఆర్​బీఐ ప్రయత్నిస్తూనే ఉంది.

Ten Rupees Coin Issue in AP
Ten Rupees Coin Issue in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 9:13 AM IST

Ten Rupees Coin Issue in AP :పది రూపాయల నాణేనికి పెద్ద ఆపద వచ్చింది! ఎలా మొదలైందో, ఎందుకు జరిగిందో తెలియదు గానీ పది రూపాయల నాణెం చెల్లదన్న అపోహ ప్రజల్లోకి వ్యాపించింది. దీంతో అప్పటి నుంచి అందరూ వీటిని తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కొన్నేళ్లుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) విశ్వప్రయత్నం చేస్తోంది.

ఏ డిజైన్, ఏ ఆకృతిలో ఉన్న పది రూపాయల నాణెమైనా చెల్లుతుందని ఆర్​బీఐ చెబుతోంది. వాటిని తీసుకోవడానికి నిరాకరించవద్దని స్పష్టం చేస్తోంది. అలాచేస్తే చట్టప్రకారం శిక్షార్హులని కూడా ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పది రూపాయల నాణేలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆర్‌బీఐ ఇవాళ విజయవాడలో ప్రధాన బ్యాంకర్లు, వారి కస్టమర్లుగా ఉన్న ముఖ్యమైన రిటైల్ సంస్థల ప్రతినిధులతో విస్తృత సమావేశం నిర్వహిస్తోంది.

ప్రజల్లో పాతుకుపోయిన అపోహలు :

  • సాధారణంగా కూరగాయల వ్యాపారులు, కిరాణా, బడ్డీ కొట్లు, చిన్నచిన్న హోటళ్ల యజమానులకు చిల్లర నాణేల కొరతతో ఇబ్బంది పడుతుంటారు. కానీ వారు కూడా పది రూపాయల నాణెం ఇస్తే మాత్రం తీసుకోబోమని చెప్పేస్తున్నారు.
  • బాగా నలిగిన పది రూపాయల నోటు అయినా తీసుకుంటున్నారు తప్ప పది నాణేలకు మాత్రం ససేమిరా అంటున్నారు.
  • పెద్ద పెద్ద మాల్స్‌ సిబ్బందిలోనూ పది నాణేలపై అపోహ ఉంది. దీంతో ఎక్కడికక్కడ వివిధ బ్యాంకుల చెస్ట్‌ల్లో పది నాణేలు లక్షల్లో పేరుకుపోతున్నాయి. విజయవాడలోని ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చెస్ట్‌లోనే ఇవి రూ.12 లక్షలు పేరుకుపోయినట్టు తెలుస్తోంది. వాటిని పెట్టేందుకు చోటులేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.

పలు డిజైన్లలో పది నాణేలు :

  • 2009 మార్చి - 2017 జూన్‌ మధ్య 14 సందర్భాల్లో పది రూపాయల నాణేలను విడుదల చేశారు. ఆయా సందర్భాల్ని బట్టి అవి పలు డిజైన్‌లతో ఉన్నాయి.
  • సాధారణంగా పది రూపాయల నోట్ల మార్పిడి ఎక్కువ. చేతులు మారే కొద్దీ అవి త్వరగా పాడవుతుంటాయి. దీన్ని అధిగమించేందుకు రిజర్వ్ బ్యాంక్ మిగతా నాణేలతోపాటు కొన్నేళ్లుగా రూ.పది నాణేలనూ ముద్రిస్తోంది.
  • దీంతో పది రూపాయల నాణేలు చెల్లుతాయని స్పష్టం చేస్తూ 2016లోనే ఆర్‌బీఐ పత్రికా ప్రకటన ఇచ్చింది. 2018లో మరో ప్రకటనా జారీ చేసింది.

RBI Clarified on 10 Rupee Coin :బ్యాంకులకు వచ్చే పాడైపోయిన నోట్లను చెస్ట్‌లలో జమ చేస్తుంటామని విజయవాడలోని ఒక బ్యాంకు మేనేజర్ తెలిపారు. అక్కడినుంచి అవి ఆర్‌బీఐకి వెళ్తుంటాయని చెప్పారు. ప్రజల్లో అపోహల వల్ల చిరిగిన నోట్లతో పాటు రూ.పది నాణేలనూ తాము బ్యాంకు చెస్ట్‌లో జమ చేయాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఆ పది రూపాయలు వద్దంటే మూడేళ్లు జైలుకే!- ఆర్​బీఐ తాజా ప్రకటన ఇదే - Indian currency coins

చిల్లర సమస్యకు చెక్​- క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌తో కాయిన్స్​- ఎలా విత్​ డ్రా చేయాలో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details