Telugu Film Producers Meeting with Deputy CM Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల సమావేశమయ్యారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కల్యాణ్‌తో చర్చించారు. అంతే కాకుండా రాష్ట్రంలో సినీరంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్‌తో సినీ నిర్మాతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్‌తో పాటు అల్లు అరవింద్, అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), బోగవల్లి ప్రసాద్, డి.వీ.వీ.దానయ్య , సుప్రియ, ఎన్.వీ.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీ.జీ.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులు పవన్ కల్యాణ్‌ను కలిశారు. కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి నిర్మాతలు అభినందనలు తెలిపి గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు, టికెట్ ధరల వెసులుబాటు, థియేటర్ల సమస్యలపై పవన్‌తో చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
'ఇక్కడి అబ్బాయి'ని కలిసేందుకు వచ్చిన 'అక్కడి అమ్మాయి'!- పవన్, సుప్రియ భేటీపై సరదా కామెంట్లు - Supriya met Pawan Kalyan
టికెట్ల రేట్లు చిన్న విషయం:పవన్ కల్యాణ్‌ను సినీ పరిశ్రమ తరపున అభినందించినట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరినట్లు తెలిపారు. అన్ని అసోసియేషన్లు కలసి వచ్చి సీఎం చంద్రబాబును అభినందిస్తామన్నారు. అదే సమయంలో సినిమా పరిశ్రమకు సంబంధించి సమస్యలపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు. సినిమా పరిశ్రమకు చాలా సమస్యలు ఉన్నాయన్న అల్లు అరవింద్ సినిమా టికెట్ల రేట్ల పెంపు అనేది మాకు చాలా చిన్న విషయమన్నారు. సీఎం చంద్రబాబును కలిసినపుడు రిప్రజెంటేషన్ రూపంలో మా సమస్యలు తెలియజేస్తామని అల్లు అరవింద్ తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను సినీ పరిశ్రమ తరపున అభినందించాము. అలానే సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరడం జరిగింది. అన్ని అసోసియేషన్లు కలసి వచ్చి సీఎం చంద్రబాబును అభినందిస్తాము. అదే సమయంలో సినిమా పరిశ్రమకు సంబంధించి సమస్యలపై సీఎంతో చర్చిస్తాను. సినిమా టికెట్ల రేట్ల పెంపు అనేది మాకు చాలా చిన్న విషయం సినిమా పరిశ్రమకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. సీఎం చంద్రబాబును కలిసినపుడు రిప్రజెంటేషన్ రూపంలో మా సమస్యలు తెలియజేస్తాము.- అల్లు అరవింద్, సినీ నిర్మాత
మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం - మంత్రివర్గ సమావేశ కీలక నిర్ణయాలు ఇవే! - Andhra Pradesh Cabinet Meeting
శపథం నెరవేర్చుకున్న రాజధాని మహిళలు - దుర్గమ్మకు మొక్కులు చెల్లింపు - CAPITAL WOMENS Padayatra