Young Man Suspicious Death in Australia: ఆస్ట్రేలియాలో తెలంగాణ వాసి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన అరవింద్ ఐదు రోజుల క్రితం ఆస్ట్రేలియాలో అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతడి ఆచూకీ కోసం గాలింపు షురూ చేశారు. ఈ క్రమంలో సముద్రతీరంలో మృతదేహం లభ్యమైంది.
కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌కు చెందిన అరవింద్ (30) బీజేపీ నేత అరటి కృష్ణ ఏకైక కుమారుడు. ఉద్యోగరీత్యా 12 సంవత్సరాల క్రితం సిడ్నీలో స్థిరపడ్డారు. తల్లి ఉషారాణి, అరవింద్ భార్యతో కలిసి జనవరి చివరి వారంలో ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం సిడ్నీ నగరంలో వాతావరణం పడకపోవడంతో అతడి తల్లి ఉషారాణి స్వస్థలమైన షాద్‌నగర్‌కు తిరిగొచ్చారు. సోమవారం రోజున అరవింద్ తన భార్యతో స్వదేశానికి వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకుని మిగిలిన ఏర్పాట్లు చేసుకున్నారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం - ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి - Telangana Students Died In America
Arvind Suspicious Death Case in Sidney:: భారతదేశానికి టికెట్లు బుక్ చేసుకున్న అనంతరం కారు వాష్ చేయించేందుకు అరవింద్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఎంతసేపయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలో సముద్రంలో ఓ యువకుడి శవం లభ్యమైంది. అది అరవింద్ మృతదేహామా? కాదా? అని నిర్ధారించేందుకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కానీ గుర్తుపట్టే స్థితిలో లేకపోవడంతో మృతదేహానికి శవ పరీక్షలు నిర్వహించగా, డీఎన్ఏ పరీక్ష ద్వారా అరవింద్ అని నిర్ధరణ జరిగింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనంతరం స్వదేశంలో ఉన్న తల్లి, బంధువులు యువకుడి మృతదేహాన్ని తీసుకురావడానికి రెండు రోజుల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లారు. యువకుడి మృతిపై స్థానిక పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కేంద్ర అధికారులతో పాటు ఆస్ట్రేలియా ఉన్నతాధికారులతో మాట్లాడి అరవింద్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు ఆ పార్టీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఏర్పాట్లు చేస్తున్నారు.
మృత్యువు వెంటాడటం అంటే ఇదేనేమో - ఒక ప్రమాదం నుంచి బయటపడిన నిమిషాల్లోనే - మరో యాక్సిడెంట్లో! - Zaheerabad Techi Died in USA