తెలంగాణ

telangana

ETV Bharat / state

చెల్లెలి ఫోటోతో ఫేస్​బుక్​ డీపీ - మాయమాటలతో తెలంగాణవాసికి రూ.1.23 కోట్లు టోపీ

యువతి నిర్వాకంతో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు - సోషల్​ మీడియా పరిచయంతో రూ.కోట్ల మోసం

Man Deceived By Woman In AP
Man Deceived By Woman In AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Man Deceived By Woman In AP : రాజశేఖర్​, రమ్యకృష్ణ, మధుబాల నటించిన చిత్రంలో అక్కా, చెల్లెళ్ల స్టోరీ తరహా ఘటన ఏపీలో జరిగింది. అది రీల్​ స్టోరీ కానీ ఈ రియల్​ స్టోరీలో చివరకు మోసపోయింది మాత్రం ఓ యువకుడు.

తెలంగాణకు చెందిన ఓ యువకుడికి ఏపీకి చెందిన మహిళతో ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో 6 ఏళ్లు ఆమెతో చాటింగ్​ చేసేవాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ అతడికి మాటలతో మభ్యపెట్టి ఏదో అవసరం ఉందని చెప్పి నగదు పంపించాలని అడిగేది. ఆమె మాటలను నమ్మిన యువకుడు పలు దఫాలుగా రూ.1.23 కోట్లను పంపించాడు. తనకు జరిగిన అన్యాయంపై పత్తికొండ పోలీసులను బాధితుడు ఆశ్రయించాడు. తాను యువకుడికి చేసిన మోసం నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని పత్తికొండలో చోటు చేసుకుంది.

ఇంతకీ ఏం జరిగిందంటే :బాధితుడు సాయిలు తెలిపిన వివరాల ప్రకారం.. పత్తికొండ మండలం చక్కరాళ్లకు చెందిన ఓ 35 ఏళ్ల మహిళకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన సాయిలు 6 ఏళ్ల కిందట ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది.

ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడితో మాట్లాడేది ఆ మహిళ, లవ్​ చేస్తున్నానని చెప్పి యువకుడికి మాయ మాటలు చెప్పింది. కొద్ది రోజలు అయ్యాక కొంత డబ్బు అవసరముందని సదరు యువతి చెప్పటంతో ఫోన్‌ పే చేశాడు బాధితుడు. అలా క్రమంగా మొదట రూ.వేలతో మొదలైంది చివరికి రూ.కోటికి చేరింది. అలా డబ్బు అడిగిన ప్రతి సారి అదిగో ఇదిగో అని చెప్పి కాలం గడిపింది. తన ఆస్తులను అమ్మకానికి పెట్టానని, ఇచ్చేస్తానని బాధితుడికి చెప్పింది.

లబోదిబోమంటున్న బాధితుడి కుటుంబ సభ్యులు :ఆ యువకుడి బ్యాంకు అకౌంట్లో ఉన్న నగదు ఖాళీ అవటంతో ఇంట్లో వాళ్లతోనూ, తెలిసిన ఫ్రెండ్స్​తోనూ, బంధువులతోనూ డబ్బు తీసుకొచ్చి ఆమె అకౌంట్​కు బదిలీ చేశారు. పరిస్థితిని గుర్తించిన యువకుడి తల్లిదండ్రులు, భార్య నిలదీయటంతో తాను మోసపోయిన సంగతి వెలుగులోకి రావడంతో కుటుంబం ఆశ్చర్యపోయింది. ఆమెను ఒక్కసారి కూడా చూడకుండా రూ.కోటికి పైగా చెల్లించడం ఏమిటని వారంతా ముక్కున వేలేసుకున్నారు.

తన సోదరి ఫేస్‌బుక్‌ ఖాతా పేరిట ఇన్నాళ్లూ తనతో మాట్లాడిన విషయం జేబు గుల్లైన తర్వాత తెలుసుకున్న వారి బంధువుల సాయంతో ఆమెను ఓ సారి హైదరాబాద్‌లో పట్టుకున్నారు. వారి నుంచి తప్పించుకోవడానికి తనను విడిచిపెడితే ఇంటికి వెళ్లి తన ఆస్తులు విక్రయించి డబ్బు తెచ్చి ఇస్తానని ఆ యువతి చెప్పటంతో మరోసారి ఆమె మాటలు నమ్మి వదలి పెట్టారు.

ఆత్మహత్యాయత్నం చేసిన యువతి :ఇక అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినప్పటికీ ఆ యువతి స్పందించకపోవటంతో బాధితుడు పత్తికొండ పోలీసులను ఆశ్రయించారు. తన నుంచి కొట్టేసిన డబ్బుతో ఆమె ఎమ్మిగనూరులో ఓ ఇల్లు, పలు ఇంటి స్థలాలు, గోల్డ్​ కొన్నట్లుగా బాధితుడు తెలిపారు. తాజాగా ఆ మహిళ అధిక మోతాదులో మాత్రలను మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, చికిత్స నిమిత్తం ఏపీలోని కర్నూలుకు తరలించడంతో ఆ యువకుడికి ఏమి చేయాలో పాలుపోక తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. డబ్బు కోసం ఒత్తిడి చేసినప్పుడల్లా పలుమార్లు ఆత్మహత్య పేరుతో తనను ఆ మహిళ బెదిరించేదని యువకుడు వాపోయారు.

ఈ విషయాన్ని పత్తికొండ సర్కిల్​ ఇన్​స్పెక్టర్ జయన్నతో ప్రస్తావించగా ఫేస్‌బుక్‌ పరిచయంతో తనకు అన్యాయం జరిగిందని ఓ యువకుడు తనను కలిశాడు తప్ప రాత పూర్వకంగా ఎలాంటి కంప్లైంట్​ చేయలేదని తెలిపాడు. అతడు మోసపోయిందంతా తెలంగాణాలోనే కావడంతో అక్కడికే వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించామన్నారు.

వివాహిత ఘరానా మోసం.. వధువుగా పరిచయమై.. ప్రేయసిగా దోచుకుని.. చివరకు..!

మారు పేర్లతో గాలం.. అందిన కాడికి మోసం..

ABOUT THE AUTHOR

...view details