Telangana Transport Authority Actions on Non Tax Payers :రాష్ట్రవ్యాప్తంగా త్రైమాసిక పన్ను చెల్లించని వాహనదారుల వివరాలను రవాణా శాఖ అధికారులు సేకరించారు. ఇప్పటివరకూ సుమారు రూ.37 కోట్ల వరకు వాహనదారులు చెల్లించాల్సి ఉందని గుర్తించారు. దీంతో పన్ను చెల్లించకుండా రోడ్లపై తిప్పుతున్న వాహనదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. వాహనదారులు పన్ను చెల్లించే గడువు జనవరి 31తో ముగియగా, మొదటి నెలలో వాహనదారులు పన్ను చెల్లిస్తే 25 శాతం, రెండో నెలలో చెల్లిస్తే 50 శాతం అదనపు పన్నుతో ఫీజు వసూలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది.
అలా కాకుండా పన్ను చెల్లించకుండా వాహన తనిఖీల్లో దొరికితే, మొదటి నెలలో వంద శాతం జరిమానా, రెండో నెలలో దొరికితే 200 శాతం జరిమానా విధిస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. అందుకే వాహనదారులుపన్నులను తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తనిఖీల్లో దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని హెచ్చరిస్తున్నారు.
'ప్రభుత్వం ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి'
Vehicle Tax Revenue To Telangana Transport Authority :పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలపై తనిఖీలు చేపట్టినట్లు రవాణా శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 220 వాహనదారుల నుంచి రూ.10 లక్షల 38 వేల 300 పన్నులను, రూ.4 లక్షల 69 వేల 320 కాంపౌండింగ్ ఫీజును వసూలు చేసినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా శాఖ అధికారి రమేశ్ తెలిపారు. సెంట్రల్ జోన్ పరిధిలో 76 కేసులు నమోదు కాగా, రూ.4 లక్షలకు పైగా పన్ను, లక్షా 84 వేల 20 కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశారు. నార్త్ జోన్ పరిధిలో 52 కేసులు నమోదు కాగా, రూ.లక్షా 71 వేల 600 పన్ను, లక్షా 14 వేల 620 కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశారు.