Telangana Tourism Weekend Tour Package:పిల్లలు సమ్మర్ సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. ఇంట్లో ఉండడమే కాకుండా అలా బయటకు వెళ్లి వస్తే.. చాలా రిలాక్స్ అవుతారు. అందుకే చాలా మంది టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి వారికోసం తెలంగాణ టూరిజం ఒక్కరోజు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు.. అతి తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. మరి ఒక్కరోజులోనే కంప్లీట్ అయ్యే ఈ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
"హైదరాబాద్-కొండపోచమ్మ-వేములవాడ-కొండగట్టు-హైదరాబాద్" పేరుతో ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తోంది తెలంగాణ టూరిజం. ఏసీ మినీ బస్‌లో ప్రయాణం ఉంటుంది. ఈ టూర్ ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. ఇక డిమాండ్‌ను బట్టి ఆదివారం కూడా టూర్ ఆపరేట్ చేస్తారు. ప్రయాణ వివరాలు చూస్తే..
ప్రయాణం ఇలా..
- ఉదయం 6 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్‌ఓ కార్యాలయం నుంచి బస్సు జర్నీ స్టార్ట్ అవుతుంది.
- 9 గంటలకు కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేరుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ మధ్యలో కంప్లీట్ చేస్తారు.
- రిజర్వాయర్ చూసిన తర్వాత ఉదయం 10 గంటలకు అక్కడి నుంచి మళ్లీ జర్నీ మొదలవుతుంది.
- అనంతరం 11 గంటలకు కొమరవెళ్లి చేరుకొని.. అక్కడ మల్లన్నను దర్శనం చేసుకుంటారు.
- దర్శనం అనంతరం వేములవాడ బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడ చేరుకుంటారు.
- మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు దర్శనం, లంచ్ ఉంటుంది.
- ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరుతారు.
- అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు కొండగట్టు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల లోపు అంజన్న దర్శనం ముగించుకుంటారు.
- అనంతరం కొండగట్టు నుంచి తిరిగి హైదరాబాద్ రిటర్న్ అయ్యి రాత్రి 10 గంటలకు సిటీకి చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.