Telangana Tourism Hyderabad Papikondalu Tour: ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పాపికొండలు చూడాలని అనుకుంటున్నారా..? గోదావరిలో బోట్ రైడింగ్ చేస్తూ.. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం తెలంగాణ టూరిజం(Telangana Tourism) స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. అతి తక్కువ ధరలోనే ఈ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను వీక్షించడం కోసం తెలంగాణ టూరిజం ఎన్నో ప్యాకేజీలను ఆపరేట్ చేస్తుంది. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు అందుబాటు ధరలోనే ప్యాకేజీలను నిర్వహిస్తోంది. అంతేకాకుండా భోజనం, వసతి వంటి సౌకర్యాలు కూడా అందిస్తోంది. ఇప్పటికే పలు ప్రదేశాలకు ప్యాకేజీలను ఆపరేట్ చేస్తున్న సంస్థ తాజాగా పాపికొండల్లో విహరిద్దామనుకునేవారి కోసం ఓ ప్యాకేజీ తీసుకొచ్చింది. మొత్తం ఈ టూర్ మూడు రోజుల పాటు సాగనుంది. హైదరాబాద్ నుంచి ప్రతి శుక్రవారం టూర్ మొదలవుతుంది. రోడ్డు మార్గం ద్వారా జర్నీ ఉంటుంది. అదనంగా గోదావరిలో బోటింగ్ కూడా ఉంటుంది.
సూపర్ టూర్ : బొగత అందాలు చూడాలంటే ఇటు.. నాగార్జున సాగర్ చూడాలంటే అటు.. తెలంగాణ టూరిజం ఒక్కరోజు ప్యాకేజీలు! - Bogatha Waterfalls Tour Package
ప్రయాణం ఇలా:పాపికొండలు చూసేందుకు తెలంగాణ టూరిజం PAPIKONDALU ROAD CUM RIVER CRUISE PACKAGE TOUR పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
- మొదటి రోజు రాత్రి 07.30 గంటలకు హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి, రాత్రి 8 గంటలకు బషీర్‌బాగ్ నుంచి బస్సు జర్నీ ద్వారా పాపికొండలు టూర్ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది. మార్గ మధ్యలో భోజనం సదుపాయం ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలంలోని హారిత హోటల్‌కు చేరుకుంటారు. ఫ్రెషప్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత 8 గంటలకు పోచారం బోటింగ్ పాయింట్‌కు చేరుకొని.. అక్కడి నుంచి పాపికొండలతో పాటు పెరంటాలపల్లికి వెళ్తారు. పోచారానికి బోట్లో జర్నీ ఉంటుంది. లంచ్‌తో పాటు స్నాక్స్ ఇస్తారు. రాత్రి భద్రాచలంలోని హారిత హోటల్లో బస చేస్తారు.
- మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత పర్ణశాలకు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కు స్టార్ట్ అవుతారు. రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ కంప్లీట్ అవుతుంది.
పాపికొండలు టూర్ ప్యాకేజీ ధరలు:హైదరాబాద్ - పాపికొండలు టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు.. 6,999రూపాయలుగా నిర్ణయించారు. పిల్లలకు 5,599 రూపాయలుగా ఉంది. అలాగే నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. బోట్లో భోజనం ఇస్తారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఊటీ సూపర్ టూర్ - బడ్జెట్ ధరలోనే తెలంగాణ టూరిజం కొత్త ప్యాకేజీ! - మరికొన్ని ప్రదేశాలు కూడా! - Telangana Tourism Mysore Tour
వీకెండ్ టూర్: ఒక్కరోజులోనే 4 ప్రదేశాలు - తక్కువ ఖర్చుతో తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ! - Telangana Tourism Weekend Tour