తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్ నుంచి కొత్త పర్యాటక ప్యాకేజీలు - ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చేలా ప్లాన్! - TOURIST PACKAGES FROM HYDERABAD

హైదరాబాద్ నుంచి కొత్త ప్యాకేజీలపై దృష్టి సారించిన పర్యాటక శాఖ - తిరుమల ప్యాకేజీలు రద్దయిన నేపథ్యంలో నిర్ణయం

Tourism Packages From Hyderabad
Telangana Tourism Packages From Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 20 hours ago

Telangana Tourism Packages From Hyderabad :చాలామంది కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు పర్యాటక ప్రాంతాలకు టూర్ ప్లాన్ చేస్తుంటారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్​తో కలిసి టూర్స్​కు వెళ్తారు. మరి మీరు కూడా అలానే ఎంజాయ్​ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం తెలంగాణ టూరిజం ఓ కొత్త ప్యాకేజీని ప్రకటించింది. అది కూడా చాలా తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి ఈ టూర్​ను ఆపరేట్ చేస్తోంది.

కొత్త ప్యాకేజీలపై దృష్టి :తిరుమల ప్యాకేజీలు రద్దయిన నేపథ్యంలో పర్యాటక శాఖ నగరం నుంచి కొత్త ప్యాకేజీలపై దృష్టి సారించింది. తిరుమల పర్యాటక ప్యాకేజీలను నవంబరులో టీటీడీ రద్దు చేసింది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ హైదరాబాద్‌ నుంచి తిరుమల శీఘ్రదర్శనం ప్యాకేజీతో మూడు బస్సులు నడిపేది.

ప్రత్యేక శీఘ్రదర్శనం ప్యాకేజీతో విమానం ద్వారా సగటున రోజు 30 మందిని తిరుమలకు తీసుకెళ్లేవారు. పర్యాటక, ఆర్టీసీకి ఇస్తున్న శీఘ్ర దర్శనం కోటాను రద్దు చేయడంతో మూడు బస్సులు ఆగిపోయాయి. ప్రస్తుతం నగరంలో నాలుగు ప్యాకేజీలను రోజువారీగా నిర్వహిస్తుండగా, హైదరాబాద్‌ నుంచి వెలుపలికి శ్రీశైలం, నాగార్జునసాగర్, వరంగల్‌ సహా మరికొన్ని ప్రాంతాలకు వారాంతంలో ప్రత్యేక ప్యాకేజీలు నిర్వహిస్తోంది.

ఒకరోజు లేదా వారాంతంలో :హైదరాబాద్‌ నుంచి ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చేలా కొన్ని ప్యాకేజీలను తీసుకువస్తే డిమాండ్‌ ఉంటుందని పర్యాటక శాఖ భావిస్తోంది. వికారాబాద్‌ అనంతగిరి, ఆలంపూర్, యాదాద్రి తదితర ప్రాంతాలకు ప్యాకేజీల ద్వారా ఉన్న బస్సుల్ని వినియోగించుకోవడంతో పాటు రాబడికి అవకాశం ఉంటుందని ఆలోచిస్తోంది. హైదరాబాద్‌ నుంచి ఒక రోజు ప్యాకేజీలు ఎన్ని, ఎలా నిర్వహించవచ్చు? ఆదరణ ఎలా ఉంటుందనే అంశాలపై అధ్యయనం చేస్తోంది.

ఒకే ట్రిప్​లో యాదాద్రి, భద్రకాళి టెంపుల్​, రామప్ప దర్శనం - తక్కువ ధరకే తెలంగాణ టూరిజం ప్యాకేజీ!

తెలంగాణ టూరిజం సూపర్​ ప్యాకేజీ - ఒకేరోజు పంచారామాల దర్శనం - ధర కూడా తక్కువే!

ABOUT THE AUTHOR

...view details