TG TET Exam 2025 : రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు నేటి నుంచి 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజుకు రెండు సెషన్లలో ఎగ్జామ్స్ జరగనున్నాయి. టెట్ పరీక్షలకు రెండు పేపర్లలకు కలిపి మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
టెట్ పరీక్షలు నిర్వహణ :
- ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్ పరీక్షలు జరుగుతాయి
- మొదటి సెషన్‌కు 7.30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు
- మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి
- రెండో సెషన్‌కు 12.30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు
- రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసి వేస్తారు.
- టెట్ మొదటి పేపర్‌కు 94,327 మంది, రెండో పేపర్‌కు 1,81,426 మంది రెండు పేపర్లకు కలిపి మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
- పరీక్ష ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరగనుంది.
- పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ సహా ఇతర నిషేధిత వస్తువులకు అనుమతి లేదు.