CEO Vikas Raj Issued Notices to Congress Party : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివరణ కోరారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్‌కు సీఈవో వికాస్ రాజ్ నోటీసులు జారీ చేశారు. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి దూషిస్తున్నారని, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్న సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరింది.
కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వండి - రాష్ట్ర కాంగ్రెస్‌కు సీఈవో నోటీసులు - EC Issued Notices to Congress - EC ISSUED NOTICES TO CONGRESS
CEO Vikas Raj Issued Notices to Congress : బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేశారు. కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి దూషిస్తున్నారని బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

CEO Vikas Raj Issued Notices to Congress (ETV Bharat)
Published : May 10, 2024, 7:55 PM IST
గులాబీ పార్టీ ఫిర్యాదు ఆధారంగా వివరణ కోరిన సీఈవో వికాస్ రాజ్, 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఫిర్యాదును సీఈవో కార్యాలయం పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్‌కు పంపింది. ఫిర్యాదులోని అంశాలపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిర్ణీత గడువులోగా వివరణ రాకపోతే, ఏమీ చెప్పేది లేదని భావించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించి చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామని సీఈవో వికాస్ రాజ్ స్పష్టం చేశారు.