Telangana Cabinet Meeting On June 21st :ఈనెల 21వ తేదీన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా రుణమాఫీ, రైతుభరోసా విధి విధానాలపై చర్చించే అవకాశం ఉంది. పంద్రాగస్ట్లోగా రైతు పంట రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, ప్రధానంగా ఇదే అంశంపై క్యాబినెట్‌లో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
రుణమాఫీకి సుమారు రూ.30వేల కోట్లు, రైతుభరోసాకు మరో రూ.7వేల కోట్లు అవసరమవడంతో, నిధుల సేకరణ ఎలా అనే అంశంపైనా కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన, పంటల బీమాపైనా మంత్రుల బృందం చర్చించనున్నట్లు తెలిసింది.