తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తులకు అదిరిపోయే శుభవార్త - కార్తికమాసం శైవక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్‌ సర్వీస్ - RTC MD ON KARTHIKA MASAM BUSES

పవిత్ర కార్తిక మాసం సందర్భంగా 'ఆర్టీసీ స్పెషల్‌' బస్సులు - భక్తుల సౌకర్యార్థం పలు దేవాలయాల రూట్లలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లుడించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

RTC Karthika Masam Special Buses
RTC Karthika Masam Special Buses (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2024, 7:33 PM IST

Updated : Nov 2, 2024, 8:55 PM IST

RTC Karthika Masam Special Buses :పవిత్ర కార్తిక మాసంలో ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వివరాలను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు. శ్రీశైలం, వేముల‌వాడ, ధ‌ర్మపురి, కీస‌ర‌గుట్ట, త‌దిత‌ర దేవాల‌యాల‌కు హైద‌రాబాద్ నుంచి స్పెష‌ల్ బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆర్టీసీ ప‌నితీరు, కార్తిక‌మాసం ఛాలెంజ్, శ‌బ‌రిమ‌ల ఆపరేష‌న్స్‌, మహాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్య ప‌థ‌కం, త‌దిత‌ర అంశాల‌పై హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ నుంచి ఉన్నతాధికారులతో ఇవాళ దృశ్య మాధ్యమ స‌మీక్షా స‌మావేశాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ నిర్వహించారు.

కార్తికమాసం సందర్భంగా స్పెషల్‌ బస్‌లు :ఆర్టీసీకి కార్తిక మాసం, శ‌బ‌రిమ‌ల ఆప‌రేష‌న్స్ ఎంతో కీల‌క‌మ‌ని, భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా త‌గు చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌కు సజ్జనార్‌ దిశా నిర్దేశం చేశారు. ఆది, సోమ‌వారాలు శైవ‌క్షేత్రాల‌కు భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని, అందుకు అనుగుణంగా ప్రత్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు. ఈ నెల 15న కార్తిక పౌర్ణమి నేప‌థ్యంలో త‌మిళ‌నాడులోని అరుణాచ‌లానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామ‌ని తెలిపారు.

ఏపీలోని పంచారామాలకు ప్రత్యేక బస్సులు : ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామాల‌కు ప్రతి సోమ‌వారం ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్నట్లు సజ్జనార్‌ వివ‌రించారు. ఈ ప్రత్యేక బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌ను tgsrtcbus.in వెబ్‌సైట్‌లో చేసుకోవాల‌ని సూచించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాల‌ని సూచించారు. బ‌స్ ఆన్ కాంట్రాక్ట్(బీవోసీ) చార్జీలు త‌గ్గించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

అద్దెకు ఇచ్చే బస్సు ఛార్జీల తగ్గింపు :అద్దె ప్రాతిపదిక‌న తీసుకునే ఆర్టీసీ బ‌స్సు చార్జీలను త‌గ్గించిన‌ట్లు సజ్జనార్ పేర్కొన్నారు. ప‌ల్లె వెలుగు బస్సుకు కిలోమీట‌ర్‌కు 11 రూపాయలు, ఎక్స్ ప్రెస్ రూ.7, డీల‌క్స్ రూ.8, సూప‌ర్ ల‌గ్జరీకి 6 రూపాయలు, రాజ‌ధాని 7 రూపాయల వరకు త‌గ్గించిన‌ట్లు పేర్కొన్నారు. శ‌బ‌రిమ‌ల‌కు, శుభ‌ముహుర్తాలకు అద్దెకు ఆర్టీసీ బ‌స్సుల‌ను బుకింగ్ చేసుకుని క్షేమంగా గ‌మ్యస్థానాల‌కు చేరుకోవాల‌ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆకాంక్షించారు.

కార్తికమాసం స్పెషల్ : ఆ పుణ్యక్షేత్రాలకు తెలంగాణ ఆర్టీసీ బస్సులు - ఫ్రీగా వెళ్లొచ్చేయండి

పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకుంటున్నారా? - తెలంగాణ ఆర్టీసీ సూపర్​ ఆఫర్ - మీ ఇంటికే బస్సు

Last Updated : Nov 2, 2024, 8:55 PM IST

ABOUT THE AUTHOR

...view details