తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణ ఆర్టీసీ'నా మజాకా - దసరా పండక్కి కళ్లు చెదిరే ఆదాయం - ఎన్ని కోట్లంటే? - TELANGANA RTC DASARA INCOME 2024

బతుకమ్మ, దసరా పండుగల వేళ దుమ్ములేపిన తెలంగాణ ఆర్టీసీ- సంస్థకు దసరా రాబడి రూ.307.16 కోట్లు

TGSRTC Dussehra Income 2024
TGSRTC Dussehra Income 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2024, 11:43 AM IST

TGSRTC Dussehra Income 2024 : దసరా పండుగకు తెలంగాణ ఆర్టీసీకి భారీగా కాసుల పంట పండింది. బ‌తుక‌మ్మ, దసరా పండుగల నేప‌థ్యంలో టీజీఎస్ఆర్టీసీ 10,512 అదనపు బస్సులను నడిపించింది. పండుగల సందర్బంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆర్టీసీ ఈనెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు టీజీఎస్ఆర్టీసీ అదనపు బస్సులను అందుబాటులో ఉంచింది. తద్వారా ఆర్టీసీకి రూ.307 కోట్ల16 లక్షల ఆదాయం సమకూరింది.

Telangana RTC Dasara Revenue :15 రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో సుమారు 707.73 లక్షల మంది ప్రయాణం చేసినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. బతుకమ్మ, దసరా పండుగల సందర్బంగా ఆర్టీసీ బస్సుల్లో భారీ సంఖ్యలో ప్రయాణించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ 10,512 అదనపు బస్సులను నడిపిన ప్రయాణికులుకు ఇక్కట్లు తప్పలేదు.

త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో UPI పేమెంట్స్ - ఇకపై అది ఫోన్​లో చూపించినా నో ప్రాబ్లమ్

ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సైతం ఆర్టీసీ అదనపు బస్సులను నడిపించింది. పండుగల నేపథ్యంలో ఈనెల 9, 10, 11 తేదిల్లో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణించినట్లు ఆర్టీసీ అధికారులు అంచనావేస్తున్నారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించింది.

రద్దీ తగ్గించేందుకు స్పెషల్​ సర్వీసులు : ట్రాఫిక్ ర‌ద్దీ నేప‌థ్యంలో ప్రయాణికుల స‌మ‌యాభావం త‌గ్గించేందుకు హైద‌రాబాద్ శివారు ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బ‌స్సుల‌ను నడిపించింది. సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీన‌గ‌ర్, ఉప్పల్, ఆరాంఘ‌ర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ త‌దిత‌ర ప్రాంతాల నుంచి స్పెష‌ల్ స‌ర్వీసులను అందుబాటులో ఉంచింది. ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌక‌ర్యార్థం గ‌చ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌, బెంగ‌ళూరు, త‌దిత‌ర ప్రాంతాల‌ నుంచి ప్రత్యేక సర్వీసులను నడిపింది. గ‌త ద‌స‌రాతో పోల్చితే ఈ సారి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు వ‌ల్ల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంది.

ఇదేం బాదుడు బాబోయ్ - ఆర్టీసీ బస్సుల్లో సీట్లు ఫుల్లు - ప్రైవేట్​ బస్సులతో జేబులకు చిల్లు

ABOUT THE AUTHOR

...view details