తెలంగాణ

telangana

ETV Bharat / state

వానాకాలం 'కరెంట్ కట్​'లపై విద్యుత్ శాఖ ఫోకస్ - కంప్లైంట్స్ స్వీకరించేందుకు ప్రత్యేక కాల్‌ సెంటర్‌ - TG Electricity New Payment System - TG ELECTRICITY NEW PAYMENT SYSTEM

Telangana Electricity Dept Focus on Call Center : మారుతున్న కాలంతో పాటు విద్యుత్ శాఖ నూతన సాంకేతికతతో వినియోగదారులకు సేవలందిస్తూ వారి మన్నన పొందేందుకు ప్రయత్నిస్తోంది. నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు బిల్లింగ్, విద్యుత్ కోత వంటి సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే యాప్, వెబ్‌సైట్ ద్వారా బిల్లుల చెల్లింపు విధానాన్ని సులభతరం చేసిన విద్యుత్ శాఖ, సరఫరా అంతరాయాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్‌ ఏర్పాటు చేసింది. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులపై స్పందిస్తోంది.

Telangana Electricity New Payment System
Telangana Electricity New Payment System (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 9:53 AM IST

Updated : Jul 13, 2024, 10:17 AM IST

Telangana Electricity New Payment System :వానాకాలంలో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడతాయి. చెట్ల కొమ్మలు కరెంట్‌ తీగలపై పడి చాలాచోట్ల సరఫరా నిలిచిపోతుంది. ఎండాకాలంలోనే కొమ్మల కత్తిరింపులు చేసినా, కొన్నిచోట్ల అనుకోని అవాంతరాలతో తీగలు తెగి సరఫరా నిలిచిపోతుంది. ప్రజలు ఫిర్యాదు చేస్తేనే విద్యుత్ సిబ్బందికీ తెలుస్తుంది. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. ప్రతీ బిల్లు వెనకాల స్థానిక ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ సెంటర్ల ఫోన్‌ నంబర్లు ముద్రిస్తోంది. అవి ఎంతకూ కలవవని, సిబ్బంది స్పందించరు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.

ఈ నేపథ్యంలోనే వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ ఫిర్యాదులు స్వీకరించే కాల్‌ సెంటర్‌ బలోపేతానికి చర్యలు చేపట్టింది. అంతరాయాలతో పాటు ఇతర విద్యుత్తు సమస్యలపైనా ఫిర్యాదు చేస్తే క్షేత్రస్థాయి సిబ్బందికి మొబైల్ లేదా యాప్‌ ద్వారా చేరవేస్తారు. సమస్యను పరిష్కరించాక క్షేత్రస్థాయి సిబ్బంది కాల్ సెంటర్‌కు సమాచారమిస్తారు. వారు ఆ విషయాన్ని రికార్డుల్లో నమోదు చేస్తారు. తర్వాత వినియోగదారుడికి ఫోన్‌ చేసి సమస్య పరిష్కారమైందా? లేదా? అని స్పందన తీసుకుంటున్నారు.

G-pay, Phonepe కట్ - వెబ్​సైట్ & యాప్ ద్వారా కరెంట్ బిల్లు ఎలా కట్టాలో మీకు తెలుసా ? - How To Pay current Bill On TGSPDCL

భారత్ బిల్‌ పేమెంట్ కరెంటు బిల్లులు : జులై 1 నుంచి విద్యుత్‌ శాఖలో భారత్ బిల్‌ పేమెంట్ సిస్టం ద్వారానే బిల్లు చెల్లింపులన్నీ జరగాలని ఆర్బీఐ నిర్దేశించింది. ఆ నిబంధనల దృష్ట్యా ఇకపై టీజీఎస్‌పీడీసీఎల్‌, టీజీఎన్‌పీడీసీఎల్‌, సహా ఏపీలోని పలు డిస్కంల పరిధిలో వచ్చే అన్ని కరెంట్ బిల్లులు అధికారిక వెబ్‌సైట్లు లేదా మొబైల్‌ యాప్‌లతోనే చెల్లించాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లిస్తే వినియోగదారులు బిల్లింగ్ సమయంలోనే సిబ్బంది వద్ద క్యూ ఆర్‌ కోడ్ ద్వారా చెల్లించే సౌకర్యాన్ని ఆయా సంస్థలు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాయి. వినియోగదారులు మొబైల్స్‌లో కోడ్ స్కాన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి విధానాల్లో బిల్లు కట్టవచ్చు. ఈ విధానం వచ్చే నెల నుంచి అందరికీ అందుబాటులోకి రానుంది.

దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు వేర్వేరుగా ప్రత్యేక యాప్‌లు తయారు చేశాయి. వాటిలో బిల్లు చెల్లింపుతో పాటు విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు, విద్యుత్ చౌర్యంపై సమాచారం, అంతరాయాలు, మీటర్ రీడింగ్ తప్పులు, బిల్లింగ్ ఫిర్యాదులతో పాటు కొత్త సర్వీస్ కనెక్షన్, లోడ్ పెంపు కేటగిరీ మార్పు, సోలార్ రూఫ్ టాప్ కోసం దరఖాస్తు, వేరేవాళ్ల పేర్లపై కనెక్షన్ బదిలీ సేవలు అందుబాటులో ఉన్నాయి.

కేటీపీపీ సరికొత్త రికార్డు - ఏకధాటిగా 202 రోజులు విద్యుత్ ఉత్పత్తి - Bhupalpalli KTPP new record

నష్టాలొచ్చే విద్యుత్‌ సర్కిళ్లను ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమైన ప్రభుత్వం - పాతబస్తీ ప్రాంతం అదానీకి! - loss making electricity circles

Last Updated : Jul 13, 2024, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details