తెలంగాణ

telangana

ETV Bharat / state

మీ ఏరియాలో పోలీసులకు మీరే మార్కులు వేయండి - ఎలా చేయాలంటే? - QR CODE FOR POLICE BEHAVIOUR IN TS

పోలీసుల సేవలపై ప్రజల అభిప్రాయ సేకరణ - అందుబాటులోకి క్యూఆర్​ కోడ్​ - స్కాన్ చేసి అభిప్రాయం చెప్పేందుకు వెసులుబాటు

Telangana Police Introduced QR Code For Police Behaviour
Telangana Police Introduced QR Code For Police Behaviour (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2025, 5:19 PM IST

Updated : Jan 13, 2025, 5:35 PM IST

Telangana Police Introduced QR Code For Police Behaviour :తమ పనితీరును స్వయంగా తెలుసుకుని మెరుగుపరుచుకోవాలి అనుకుంటోంది పోలీస్ శాఖ. అందుకు ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్​ను ప్రవేశపెట్టింది. దీన్ని ఇటీవలే డీజీపీ జితేందర్​ విడుదల చేశారు. ఇది అన్ని పోలీస్ స్టేన్లకు చేరింది. ప్రతి పోలీస్​ స్టేషన్​ ఆవరణలో ఫిర్యాదుదారులకు కనిపించే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. వివిధ సమస్యలపై ఠాణాలో ఫిర్యాదు చేసిన తర్వాత వారికి అందుతున్న సేవలపై క్యూఆర్​ కోడ్ స్కాన్​ చేసి అందులో వచ్చే ఫారంపై వివరాలు ఇవ్వాలి. ఇది నేరుగా హైదరాబాద్ డీజీ కార్యాలయానికి చేరుతుంది. ఎవరు సమాచారం ఇచ్చారు అన్నది సంబంధిత స్టేషన్లకు తెలియజేయరు.

అందులో మీరు ఏం చెప్పవచ్చంటే :

  • ఫిర్యాదు చేసిన తర్వాత కేసు ఎలా నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేశారా లేదా?
  • ఎఫ్​ఐఆర్​ చేశారా? లేదా?
  • పోలీసులు మాట్లాడిన తీరు ఎలా ఉంది?
  • ట్రాఫిక్​ చలాన్ల గురించి
  • పాస్​పోర్టు ధ్రువీకరణ ఏ స్థితిలో ఉంది?
  • ఇతర సేవలు గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా?

క్యూఆర్​ కోడ్ ఎలా స్కాన్ చేయాలి

  • సెల్​ఫోన్​లో క్యూఆర్ కోడ్​ను స్కాన్​ చేయాలి.
  • ఓపెన్​ వెబ్​సైట్ అని ట్యాప్​ షటర్ బటన్​ రాగానే దానిపై ట్యాప్ చేయాలి.
  • సిటిజన్ ఫీడ్ బ్యాక్​ ఫాం, పోలీసు శాఖల సేవలపై ప్రజల అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది.
  • తెలుగు, ఆంగ్ల భాషల్లో ఒకదాన్ని ఎంచుకోవాలని సూచిస్తుంది.
  • భాష ఎంచుకున్న తర్వాత పేరు, సెల్​ఫోన్ నంబరు, ఈమెయిల్​ ఐడీ, అభిప్రాయం, జిల్లా లేదా కమిషనరేట్ పేరు, పోలీస్​ స్టేషన్​ పేరు నమోదు చేయాలి.
  • తర్వాత మీ అభిప్రాయాన్ని రాయాలి. అలా నింపిన ఫారాన్ని పంపించాలి.

అది ఫలితం ఇవ్వకపోవడం వల్ల :పోలీసు శాఖ పని తీసురు గతంలో థర్డ్​ పార్టీ విచారణ ద్వారా తెలుసుకునేవారు. ఫిర్యాదు చేసిన వ్యక్తుల్లో కొందరికి హైదరాబాద్​ నుంచి కాల్​ చేసి వివరాలు సేకరించేవారు. ఇది అంతగా ఫలితం ఇవ్వలేదు. దీంతో ప్రజలు తమ అభిప్రాయాలను ఇచ్చేందుకు కొత్తగా క్యూఆర్​ కోడ్​ను తీసుకొచ్చారు.

మహిళతో దురుసు ప్రవర్తన - మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్​ సస్పెండ్

SSC భారీ నోటిఫికేషన్​ - పదో తరగతి అర్హతతో - 39481 (GD) కానిస్టేబుల్ పోస్టులు భర్తీ! - SSC GD Notification 2025

Last Updated : Jan 13, 2025, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details