Nepali Thieves Gang in Hyderabad :నమ్మకమే పెట్టుబడిగా రాష్ట్రంలో నేపాలీలు రెచ్చిపోతున్నారు. ఇంటికి కాపాలదారులుగా చేరి యజమానుల విశ్వాసం చూరగొని లూటీ మొదలుపెట్టి ఇళ్లు కొల్లగొట్టేస్తున్నారు. సికింద్రాబాద్‌లో ఓ ప్రముఖ జువెలరీ వ్యాపారి ఇంట్లో పనివాళ్లుగా చేరిన నేపాలీ దంపతులు రూ.25 నుంచి రూ.30లక్షల విలువైన వజ్రాభరణాలు కొట్టేశారు. పక్కా పథకంతో ఇంట్లోకి చేరి నమ్మకంగా ఉంటూనే యజమాని కుటుంబం ముంబయి వెళ్లగానే అందినంత దోచుకొని పారిపోయారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసి రిమాండుకు తరిలించారు.
మరో కేసులో నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ వ్యాపారి నివాసంలో రూ.70లక్షల విలువైన సొత్తు మాయమైంది. ఇదంతా పని మనుషుల చేతివాటమంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. తాజాగా దోమలగూడ గగన్‌మహల్ ప్రాంతంలో విశ్రాంత ఉద్యోగికి కేర్‌టేకర్‌గా చేరిన యువకుడు నమ్మకం చూరగొన్నాడు. ఆ తర్వాత విశ్రాంత ఉద్యోగి బ్యాంకు ఏటీఎం కార్డులు తీసుకొని రూ.30లక్షలు కాజేశాడు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
అదనుచూసి దోచేస్తారు : ఇళ్లల్లోకి చేరి తమ కుటుంబం గడిచేందుకు ఉపాధి చూపమంటూ ఇంటి యాజయానిని కోరుతారు. అదనుకోసం ఎదురు చూస్తారు. ఇళ్లలో విలువైన ఆభరణాలు భద్రపరిచే ప్రాంతాలు, కుటుంబ సభ్యుల రాకపోకలపై కన్నేస్తారు. ఎప్పటికప్పుడు గమనిస్తూ కుటుంబ సభ్యులు వేడుకలు, విహారయాత్రలకు దూర ప్రాంతాలకు వెళ్లగానే తమ పథకం అమలు చేయటం వీరి ప్రత్యేకత. ఇంట్లో దొరికినంత దోచుకొని రాత్రికి రాత్రే దిల్లీ చేరతారు. అక్కడ ముఠాలకు బంగారు ఆభరణాలు అందజేసి సొంతూళ్లకు చేరతారు. పనిమనుషుల ముసుగులో చేతికొచ్చిన సొమ్ముతో విలాసవంతంగా జీవిస్తున్న వీరిని గమనించిన యువకులు నేరబాట పడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
తాళం వేసిన ఇళ్లే ఆదొంగల టార్గెట్ - నగరంలో బెంబేలెత్తిస్తున్న వరుస చోరీలు - Massive theft in Shameerpet
ఈ ఏడాది 5 నెలల వ్యవధిలోనే ఈ తరహా చోరీలు, మోసాలపై 40కి పైగా పోలీసులు కేసులు నమోదు చేశారు. గ్రేటర్‌లో పనిమనుషులకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇంటా, బయటా సహాయకులుగా పనిచేసేందుకు స్ధానికులు పెద్దమొత్తంలో వేతనం ఆశించటంతో బయటి వారికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారైతే 24 గంటలు అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో యజమానులు అటువైపు మొగ్గుచూపుతున్నారు.
వివరాలు తీసుకని పనిలే చేర్చుకోండి : పనిలో కుదుర్చుకునే ముందుగానే వారి వ్యక్తిగత వివరాలు, నేరచరిత్రపై ఆరా తీయటం. ఆధార్, ఫోన్‌నెంబర్లు తీసుకోవాలని పోలీసులు పలుమార్లు సూచించినా అధికశాతం ఇంటి యజయానులు పెడచెవిన పెడుతున్నారు. హాక్-ఐ యాప్‌లో వివరాలు నమోదు చేస్తే వారి పుట్టుపూర్వోత్తరాలు రాబడతామని సూచించినా తేలికగా తీసుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు తరహాలో ఇల్లు గుల్లయ్యాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
కష్టార్జితం ఇంటిదొంగల పాలవకుండా ఉండేందుకు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో ఉంచటం, దూరప్రాంతాలకు వెళ్లినపుడు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందజేయాలని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు నేపాలీ గ్యాంగ్ చేసిన చోరీల వివరాలు ఇదేవిధంగా ఉన్నాయి. 2019 సంవత్సరంలో 87, 2020 సంవత్సరంలో 61, 2021 సంవత్సరంలో 90, 2022 సంవత్సరంలో101, 2023 సంవత్సరంలో 116, 2024 సంవత్సరం దాదాపు ఇప్పటి వరకు 40 కేసులు నమోదు అయిన్నట్లు సమాచారం.
హైదరాబాద్ శివారు ప్రాంతాలను వణికిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా - చోరీల్లో తల్లిదండ్రులే పిల్లలకు గురువులు! - Dhar Gang Robbery in Hyderabad
ఏడాదిలో సగం చోరీలు వేసవిలోనే జరుగుతున్నాయట - మీరు ఎక్కడికైనా వెళ్తే ఇల్లు జాగ్రత్త సుమీ! - Precautions Against Thieves Summer