Telangana Phone Tapping Case Updates :ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ చేసే కొద్దీ కొత్త అంశాలు బయటికి వస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డికి చెందిన సొమ్మును ఎక్కువగా తరలించినట్లు రాధాకిషన్‌రావు (Task Force EX OSD Radhakishan Rao Case) పోలీసులకు తెలిపినట్లు సమాచారం. డబ్బు రవాణాకు ఎస్కార్ట్‌గా వినియోగించుకున్న ఓ ఎస్సైని రాధాకిషన్‌రావు తప్పుడు సమాచారం ఇచ్చి బురిడీ కొట్టించినట్లు దర్యాప్తులో తేలింది.
Task Force EX OSD Radhakishan Rao Case : ఎన్నికల సొమ్ము తరలింపు విషయాన్ని చెప్పకుండా అత్యవసర పరిస్థితులకు అవసరమైన డబ్బును తరలించేందుకు సహకరించాలని ఎస్సైని రాధాకిషన్‌రావు నమ్మించినట్లు తెలిసింది. ఎన్నికల నియామవళి అమల్లో ఉన్న సమయంలో నిఘా బృందాలకు చిక్కకుండా ఉండేందుకు మాత్రమే అత్యవసర సొమ్మును పోలీసు వాహనాల్లో తరలిస్తున్నట్లు ఆయన సదరు ఎస్సైని నమ్మించినట్లు సమాచారం.
'రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టారు' - Telangana Phone Tapping Case Update
బీఆర్ఎస్‌కు లబ్ధి చేకూర్చేలా: 2023 అక్టోబరులో ఎన్నికల సమయంలో రాధాకిషన్‌రావు బీఆర్ఎస్‌కు లబ్ధి చేకూర్చేలా డబ్బు తరలించే కార్యాచరణకు పూనుకున్నారు. సదరు ఎస్సైకి ప్రత్యేకంగా ప్రభుత్వ బొలెరో వాహనాన్ని సమకూర్చి, అందులోనే పెద్దఎత్తున నగదును తరలించినట్లు తెలిసింది. ఆ సమయంలో రాధాకిషన్‌రావు సూచనతో ఆయన ఓ సందర్భంలో సికింద్రాబాద్‌లో ప్రముఖ ఆసుపత్రిలో విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్ రావును కలిశారు.
SIB EX DSP Praneeth Rao Case Update : దివ్యచరణ్ రావు పంపించిన ఓ వ్యక్తితో కలిసి ఎస్సై రాణిగంజ్‌కి వెళ్లారు. అక్కడ రూ.కోటి తీసుకొని తిరిగి ఆసుపత్రికి తీసుకొచ్చి దివ్యచరణ్ రావుకు అప్పగించారు. మరోసారి అదే ఆసుపత్రి నుంచి ఆయన పంపించిన వ్యక్తితో కలిసి అఫ్జల్‌గంజ్ వెళ్లారు. అక్కడ మరో రూ.కోటి తీసుకొని మలక్‌పేటలోని ఆసుపత్రిలో దివ్యచరణ్ రావుకు అప్పగించారు.
MLC Venkatrami Reddy Money Transported in Escort Vehicles : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, విశ్రాంత ఐఏఎస్ వెంకట్రామిరెడ్డికి (BRS MLC Venkatarami Reddy) చెందిన డబ్బు తరలింపు వాహనాలకు రాధాకిషన్‌రావు ఆదేశాలతో ఎస్సై పలు విడతలుగా ఎస్కార్ట్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే తెల్లాపూర్‌లోని రాజ్ పుష్ప గ్రీనోడేల్ విల్లాస్‌లో వెంకట్రామిరెడ్డి ఇంటి సమీపంలో ఉండే శివచరణ్ రెడ్డి అలియాస్ చరణ్‌ను కలవాలని రాధాకిషన్‌రావు ఎస్సైకి సూచించారు. అనంతరం శివచరణ్ రెడ్డి కొత్త ఐఫోన్, సిమ్‌కార్డు తీసుకొచ్చి ఆయనకు అప్పగించారు. నగదు తరలింపు వ్యవహారాల గురించి ఆ ఫోన్లోనే సంభాషించేవారు.