Telangana Phone Tapping Case Update Latest : ప్రణీత్‌రావు బృందం సాగించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. వామపక్ష తీవ్రవాదంపై కన్నేసేందుకు సమకూర్చుకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు ఉపయోగించారనేది ఈ కేసులో ప్రధాన అభియోగం. ఎన్నికల సమయంలో పట్టుకున్న డబ్బులో ప్రతిపక్షాలకు చెందినదే ఎక్కువగా ఉంది.
Praneeth Rao Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఇది సాధ్యమైందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐతే ప్రణీత్‌రావుబృందం తన సొంత ప్రయోజనాలకు కూడా ట్యాపింగ్‌ను వాడుకున్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ దిశగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో హవాలా, స్థిరాస్తి వ్యాపారాలపై నిఘా పెట్టి భారీగా డబ్బు దండుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.
శాసనసభ ఎన్నికల (Telangana Assembly Elections 2024) వేళ పోలీసు తనిఖీల్లో దాదాపు 350 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎక్కువమొత్తం హవాలా వ్యాపారానికి సంబంధించినదే. 300 కిలోల బంగారం, వెయ్యి కిలోల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో సొత్తు రవాణా చేసే వారినే ప్రణీత్‌రావు బృందం లక్ష్యంగా చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హవాలా డబ్బు కనుక ఎవరూ ఫిర్యాదు చేయరు. పట్టుకున్న డబ్బులో దొరికినంత దండుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి లోతుగా విశ్లేషిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు షాక్ - పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు -