ప్రణీత్‌రావు కేసు దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు Telangana Phone Tapping CaseUpdates :ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అన్ని ఆదేశాలూ కీలక కార్యాలయం నుంచి అందినట్లు పోలీసులకు సమాచారం దొరికింది. అక్కడి ఆదేశాల మేరకే ప్రణీత్, ఇతర ఉన్నతాధికారులు పని చేసినట్లు వెల్లడైంది. సున్నితమైన అంశం కావడం వల్ల మరింత లోతుగా ఆరా తీసి పకడ్బందీ ఆధారాలతో కేసును బలోపేతం చేయాలని పోలీసులు నిర్ణయించారు.
ఆధారాలు సేకరించాకే మరికొందరి అరెస్ట్ : స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసి సస్పెండైన ప్రణీత్‌రావు (TS Phone Tapping Case) ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో ఇప్పటివరకు అతడితోపాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను మాత్రమే అరెస్ట్ చేశారు. పక్కా ఆధారాలు సేకరించాకే మరికొందరిని అరెస్ట్ చేయనున్నారు. ఈ జాబితాలో ప్రముఖ రాజకీయ నేతలతోపాటు విశ్రాంత, ప్రస్తుత పోలీస్ అధికారులు ఉండనున్నట్లు తెలుస్తోంది.
SIB Ex DSP Praneeth Rao Case Updates :ఈ వ్యవహారంలో మరింత సమాచారం సేకరించేందుకు ముగ్గురు నిందితులను తిరిగి కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. మంగళవారం న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నియామావళి అమల్లో ఉన్న సమయంలో హైదరాబాద్ కమిషనర్‌గా సందీప్ శాండిల్యను ఈసీ నియమించడంతో ప్రణీత్‌రావు బృందం వ్యూహం మార్చింది. ఎన్నికల్లో రాజధాని నుంచి హవాలా సొమ్ము రాష్ట్రంలోని బయటి ప్రాంతాలకు భారీగా తరలిస్తారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్(Praneeth Rao Phone Tapping Case)ప్రక్రియను విస్తృతం చేశారు.
ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు షాక్ - పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు - SIB EX DSP Praneeth Rao Case
హైదరాబాద్ కమిషనరేట్‌లో క్షేత్రస్థాయి ఆపరేషన్లు చేపట్టేందుకు అవకాశం చిక్కదనే ఉద్దేశంతో శివారు ప్రాంతాలపై దృష్టి సారించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్లు ఎక్కువగా నిర్వహించినట్లు దర్యాప్తు క్రమంలో వెల్లడైంది. అక్కడైతే తమకు అనుకూలమైన వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రణీత్ బృందం ఆ ప్రాంతంలో తెరచాటు కార్యకలాపాలకు తెరలేపింది. హవాలా లావాదేవీలే కావడం వల్ల దొరికిన సొమ్మును భారీగా పక్కదారి పట్టించినట్లు దర్యాప్తు బృందం ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఈక్రమంలోనే పకడ్బందీ ఆధారాలు సేకరించే యోచనతో కార్యాచరణ రూపొందించడంపై దృష్టి సారించారు.
ప్రణీత్‌రావు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు - అన్ని నేరాలు చేశాడా?
వాస్తవానికి ప్రణీత్‌రావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. 2018లో ఎస్ఐబీలో ఇన్స్పెక్టర్గా చేరి, 2023లో డీఎస్పీగా ఆక్సిలరేటెడ్ పదోన్నతి పొందారు. ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదం ఉండటంతో అది సాధ్యమైంది. తాజాగా ప్రణీత్ దందా బహిర్గతం కావడం వల్ల అతడి ప్రమోషన్‌పై ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం అతని పదోన్నతి దస్త్రాన్ని బయటికి తీసి ఆరా తీస్తున్నారు. ప్రణీత్‌రావుకు ప్రమోషన్ ఇప్పించడంలో ఎవరి పాత్ర ఉంది? ఒకవేళ అడ్డదారిలో పొందితే అందుకు సహకరించింది ఎవరు? అనే అంశాలతో ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈ కేసులో అరెస్టైన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్ - SIB Praneeth Rao Case Updates
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు - ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్ట్ - PRANEETH RAO CASE updates