తెలంగాణ

telangana

ETV Bharat / state

మీకూ అర్ధరాత్రి న్యూడ్ ​వీడియో కాల్‌ వస్తున్నాయా? - అయితే జాగ్రత్త పడండి - NUDE VIDEO CALL TO MLA

ఈ నెల 14న అర్ధరాత్రి ఓ ఎమ్మెల్యేకు వీడియో కాల్ - కాల్‌ ఆన్సర్‌ చేయగానే ఫోన్‌ తెరపై నగ్నంగా మహిళ - ఆందోళనకు గురైన ఎమ్మెల్యే

MLA RECEIVED NUDE VIDEO CALL
Nude Video to MLA in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2024, 11:11 AM IST

Updated : Oct 19, 2024, 2:58 PM IST

Nude Video to MLA in Telangana :వీడియో కాల్​ చేసి, అందులో నగ్నంగా కనిపించి, ఆ స్క్రీన్​ షాట్లు తీసుకుని బెదిరించి డబ్బులు వసూలు చేయడం లాంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. ఇలాంటి వీడియో కాల్స్​తో ఎంతోమందిని సైబర్​ కేటుగాళ్లు నిలువెల్లా దోచుకుంటున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యేకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ నెల 14న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వీడియో కాల్​ వచ్చింది. గుర్తు తెలియని నంబర్‌ నుంచి వచ్చిన ఆ వీడియో కాల్‌ను ఎమ్మెల్యే ఆన్సర్‌ చేశారు. ఆ వెంటనే ఫోన్​ స్క్రీన్​పై మహిళ నగ్నంగా కనిపించింది.

సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలో కేసు నమోదు : ఊహించని పరిణామంతో ఆందోళనకు గురైన ఎమ్మెల్యే వెంటనే వీడియో కాల్​ను కట్​ చేశారు. అయితే తనపై కుట్ర పన్నేందుకు ఎవరైనా అలా న్యూడ్​ వీడియో కాల్​ చేశారా? లేదా నిజంగానే గుర్తు తెలియని వ్యక్తులే ఇలా చేసి ఉంటారా అనే అనుమానం ఎమ్మెల్యేకు కలిగింది. ఇలా వీడియో కాల్​ చేసి తన ప్రతిష్ఠను దిగజార్చడంతో పాటు బ్లాక్‌మెయిల్‌ చేసే ఉద్దేశంతో ఎవరైనా ఈ పనికి పాల్పడి ఉంటారనే అనుమానంతో ఆయన వెంటనే నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు గురువారం తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ)లోనూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్​ నంబర్​ ఎవరిదనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

మోసాలు ఎన్నో రకాలు : ఎన్నో రకాలుగా మోసం చేయడానికి కేటుగాళ్లు వెనకాడడం లేదు. ఫేక్​ కాల్స్​ చేస్తూ లేదా వీడియో కాల్స్​ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. మీ పేరు మీద డ్రగ్స్​ పార్సిల్ వచ్చిందంటూ, మీరు మనీలాండరింగ్‌ కేసులో ఉన్నారంటూ భయాందోళనకు గురి చేసి రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. ఇటీవల ఓ మహిళకు సైబర్​ నేరస్థులు వీడియో కాల్​ చేసి తాము సీబీఐ పోలీసులు అని, మీ భర్త, కుమారుడిని డ్రగ్, మనీలాండరింగ్‌ కేసులో ‘నాన్‌-బెయిల్‌ వారెంట్‌’పై అరెస్టు చేశామని నమ్మించారు. వారిని కేసు నుంచి తప్పించాలన్నా ఇంటికి పంపాలన్నా వెంటనే రూ.50 వేలు ఇవ్వాలంటూ డిమాండ్​ చేశారు. మొదట ఇదంతా నమ్మిన ఆ మహిళ వారి వ్యవహార శైలిపై అనుమానం వచ్చి వెంటనే తన భర్తకు కాల్​ చేయగా మోసమని గ్రహించింది. మోసం చేయడానికి ఇదో రకమైన వీడియో కాల్​ అయితే మరో రకంగా న్యూడ్‌ వీడియో కాల్స్‌ చేస్తూ కూడా బెదిరింపులకు పాల్పడి భారీగా దోచుకుంటున్నారు.

Nude Video Calls : నగ్నంగా వీడియోకాల్ చేయమంటారు.. నగదంతా దోచేస్తారు

రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. ఆర్మీ కాంట్రాక్ట్, న్యూడ్‌ వీడియోలతో దోచేశారు..

Last Updated : Oct 19, 2024, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details