Telangana Man Returned From Cambodia :కాంబోడియాలో బందీగా మారి చిత్రహింసలు అనుభవించిన మహబూబాబాద్‌కు చెందిన ప్రకాశ్ ఎట్టకేలకు క్షేమంగా సొంత ఇంటికి చేరుకున్నాడు. విదేశాల్లో ఉపాధి కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఏజెన్సీ మోసపోయి ఆస్ట్రేలియా అని కాంబోడియాకు వెళ్లిన ప్రకాశ్ అక్కడ తీవ్రంగా చిత్రసింహలు అనుభవించాడు. ఆ మధ్యకాలంలో తాను అనుభవిస్తున్న హింసలను సెల్ఫీ వీడియోలో చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
వీడియో వైరల్ కాగా అతని కుటుంబ సభ్యులు ఎస్పీ రాంనాథ్ కేకన్‌కు ఫిర్యాదు చేయగా వారు కాంబోడియాలోని ఇండియన్ ఎంబసీతో మాట్లాడారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత కాంబోడియాలో ఉంటున్న తన స్నేహితుడికి చెప్పి సహాయం కోరింది. ప్రకాశ్ విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయడు ఎంబసీ అధికారులతో మాట్లాడి అతని యోగక్షేమాలు తెలుసుకొని స్వదేశానికి రప్పించేందుకు కృషి చేశాడు. అందరి ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు ప్రకాశ్ స్వదేశానికి తిరిగి వచ్చాడు.
తనను ఇక్కడికి తీసుకురావడానికి సహకరించిన అధికారులు, ప్రజా ప్రతినిధులకు, ఎంబసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు. తనను మోసం చేసిన ఏజెన్సీపై కేసు పెట్టినట్లు చెప్పాడు. కాంబోడియాలో తన లాంటివారు 5వేల మందికి పైగా ఉన్నారని, వారంతా వెంటనే మానవ హక్కుల కమిషన్‌కు, భారత ఎంబసీ అధికారులకు తెలియజేస్తే స్వదేశానికి పంపించేందుకు సహాయం చేస్తారని సూచించాడు. ఎవరు సైబర్ నేరాలు, వలపు వలల విసిరి భారతీయులను మోసం చేయవద్దని విజ్ఞప్తి చేశాడు.