Telangana High CourtVerdict on Land Allotment Cancel for Industries : ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూములు దక్కించుకుని పరిశ్రమలు పెట్టని సంస్థలకు తెలంగాణ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ఇందూటెక్ జోన్, బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్ సహా నిర్మాణాలు ప్రారంభించని కంపెనీల భూముల్ని 4 నెలల్లో స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే పనులు మొదలైన వాటిలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఆస్తుల కేటాయింపులో పారదర్శకత ఉండాలి : ఉమ్మడి రాష్ట్రంలో 2001 నుంచి 2006 వరకూ ఎలాంటి ప్రకటన లేకుండా, వేలం నిర్వహించకుండా, నామినేషన్ పద్ధతిపై 4,156 ఎకరాలను పలు కంపెనీలకు, వ్యక్తులకు కారుచౌకగా విక్రయంచడం, లీజుపై కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఛత్రి అనే స్వచ్ఛంద సంస్థ 2007లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై (PIL) తెలంగాణ హైకోర్ట్ సుదీర్ఘ విచారణ చేపట్టి 72 పేజీల తీర్పు వెలువరించింది. పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయని గుర్తుచేసింది. వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించినందున పిటిషనర్ కోరినట్లుగా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సొమ్ము వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తే అది ప్రభుత్వ విధాన నిర్ణయాలకు విరుద్ధం అవుతుందని అభిప్రాయపడింది.అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
'మేం ప్రభుత్వాన్ని ఆదేశించలేం' - గీత కార్మికుల దుకాణాలపై హైకోర్టు తీర్పు - Liquor shops in ap