Telangana High Court on Durgam Cheruvu FTL : దుర్గం చెరువు ఎఫ్టీఎల్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణ శాస్త్రీయంగా జరగలేదంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను సీజే ధర్మాసనం విచారించింది. ఈ క్రమంలో ఎఫ్టీఎల్పై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. బాధితులు చెరువుల పరిరక్షణ కమిటీకి అభ్యంతరాలు తెలపాలని హైకోర్టు తెలిపింది. వారంలోపు బాధితులు అభ్యంతరాలు తెలపాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.
దుర్గం చెరువు ఎఫ్టీఎల్ను 6 వారాల్లో నిర్ధారించాలి : హైకోర్టు - Durgam Cheruvu FTL Issue in hc
Arguments on Durgam Pond FTL in High Court : దుర్గం చెరువు ఎఫ్టీఎల్పై బాధితులు తెలిపిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఆరు వారాల్లో ఎఫ్టీఎల్ నిర్ధారించాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆరు వారాల్లోపు కూల్చివేతలు చేపట్టబోమని జీహెచ్ఎంసీ తెలిపింది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్పై ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి.
Arguments on Durgam Pond FTL in High Court (ETV Bharat)
Published : Sep 23, 2024, 2:56 PM IST
అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని 6 వారాల్లో ఎఫ్టీఎల్ నిర్ధారించాలని హైకోర్టు స్పష్టం చేసింది. 6 వారాల్లోపు కూల్చివేతలు చేపట్టబోమని కోర్టుకు జీహెచ్ఎంసీ తెలిపింది. రికార్డుల ప్రకారం దుర్గం చెరువు ఎఫ్టీఎల్ 65 ఎకరాలే ఉందని పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ 160 ఎకరాలు ఉందని అధికారులు చెప్పడం సరికాదని పిటిషనర్లు వాదించారు.