Law Clerk Posts in Telangana High Court :తెలంగాణ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 33 లా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టులో 31 ఖాళీలు ఉండగా, తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ, సికింద్రాబాద్‌లో 2 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర హైకోర్టు లేదా తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ, సికింద్రాబాద్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థులు నవంబరు 23 సాయంత్రం 5 గంటల్లోపు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు పేరు - ఖాళీలు
లా క్లర్క్ : మొత్తం 33 పోస్టులు
అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి.