తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధ్యాయ పదోన్నతులపై హైకోర్టు ఆగ్రహం - తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి సూచన - TG HC on Teachers Transfer

Teachers Transfer Issue in Telangana : రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పదోన్నతులపై వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రక్రియను ఎలా కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని నిలదీసింది. తక్షణమే పదోన్నతుల ప్రక్రియను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది.

By ETV Bharat Telangana Team

Published : Jun 19, 2024, 7:27 AM IST

Teachers Transfer Issue in Telangana
Telangana High Court Fire on TG GOVT (ETV Bharat)

ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియపై హైకోర్టు ఆగ్రహం (ETV Bharat)

Telangana High Court on Teachers Transfer Issue: ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉన్నా ప్రక్రియను ఎలా కొనసాగిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలన్న ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. అయినా ఆ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ వెనక్కు పంపిన విషయం తెలిసీ ఎలా చేపడతారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనను ప్రశ్నించింది. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని పేర్కొంది.

Teachers Transfer Issue in Telangana :గతంలోటెట్​కు సంబంధించి రెండు వేర్వేరు ఉత్తర్వులున్నందున రెండింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సింగిల్​ జడ్జికే వివాదాన్ని పంపింది. ఈ విషయం తెలిసి కూడా ప్రక్రియను ఎలా చేపడతారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్కూలు అసిస్టెంట్ పోస్టుల పదోన్నతుల్లో భాగంగా టెట్​లో అర్హత సాధించని ఎస్​జీటీలకు అవకాశం కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ 150 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి టెట్​తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 52 మంది హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

School Assistant Promotion Issue in TG : పిటిషనర్ల తరపున వాదించిన న్యాయవాది రాజశేఖర్ టెట్ అర్హత లేనివారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతులకు అవకాశం కల్పిస్తే అన్యాయం జరుగుతుందన్నారు. ఐతే అభ్యర్థులు 1995-2008 మధ్య ఎస్​జీటీలుగా నియమితులయ్యారని ప్రతివాదుల తరఫున న్యాయవాది ఎం. రాంగోపాల్ రావు వాదించారు. కానీ ఎస్​సీటీఈ నోటిఫికేషన్ 2010లో వచ్చిందని తెలిపారు. ఎస్​సీటీఈ నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెట్ అర్హత తప్పనిసరన్నారు. అందువల్ల నోటిఫికేషన్​కు ముందు నియమితులైనవారికి టెట్ అవసరంలేదంటూ 2015లో ప్రభుత్వం జీవో 36 జారీ చేసిందన్నారు. ఇందులో 12వ నిబంధన ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతోందని, తర్వాత కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెట్ తప్పనిసరని ఎప్పుడూ నోటీసు కూడా ఇవ్వలేదన్నారు.

\తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల - రిజల్ట్స్​ ఇలా చెక్​ చేస్కోండి - TELANGANA TET RESULTS RELEASED 2024

Teachers Transfer Schedule 2024 :ప్రస్తుతం పదోన్నతుల సమయంలో 2010కి ముందు నియమితులైన వారికి ఎస్​సీటీఈ నోటిఫికేషన్​ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సరికాదన్నారు. ఈ నిబంధనలను ప్రస్తుత పిటిషనర్లతో సహా ఎవరూ సవాలు చేయలేదన్నారు. మరో పిటిషన్​లో ఎస్​సీటీఈ నోటిఫికేషన్ ప్రకారం పదోన్నతులు చేపట్టాలంటూ మరో సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అప్పీలుపై విచారించిన ధర్మాసనం ఈనెల 14న వివాదాన్ని తిరిగి సింగిల్ జడ్జి వద్దకే పంపింది. ఎస్​సీటీఈ నోటిఫికేషన్ ప్రకారం జరగాలన్న అంశాన్ని, జీవో 36ను అమలు చేయాలన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం వెల్లడించాలని ఆదేశించింది.

Trial in High Court on Teacher Transfer: పదొన్నతుల ప్రక్రియ గురించి సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించింది. ఈ విషయాన్ని ధర్మాసనం ముందు ప్రస్తావించిన ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులో అప్పీలు చేసినట్లు ప్రభుత్వానికి తెలియదన్నారు. ఎలాంటి కాపీలను అందజేయలేదని, కౌంటరు కూడా దాఖలు చేయలేదన్నారు. కొంత సమయం ఇస్తే కోర్టుకు వచ్చిన అధికారులను వివరణ అడిగి చెబుతానన్నారు. దీంతో సంబంధిత అధికారిని పిలవాలని ధర్మాసనం ఆదేశించగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన హాజరయ్యారు.

నిబంధనల ప్రకారమే ప్రక్రియ చేశాం : ఎస్​సీటీఈ నిబంధనల ప్రకారమే ప్రక్రియ మొదలు పెట్టామని, ఇందులో టెట్ అర్హత లేనివారిని పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి వెనక్కి పంపిన విషయం తెలిసి కూడా ప్రక్రియను ఎలా చేపడతారని నిలదీసింది. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈనెల 14న ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని, తాజాగా ఎలాంటి ఆదేశాలివ్వలేమంటూ అప్పీళ్లపై విచారణను మూసివేసింది. ఇప్పటికే ఇచ్చిన పదోన్నతుల ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా ప్రభుత్వానికి సూచించాలంటూ ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టం చేసింది.

టీచర్ బదిలీల షెడ్యూల్ విడుదల - ఎప్పటినుంచంటే - Teachers Transfer Schedule

ABOUT THE AUTHOR

...view details