తెలంగాణ

telangana

ETV Bharat / state

చెన్నమనేని జర్మనీ పౌరుడే : తేల్చిచెప్పిన హైకోర్టు - 30లక్షల ఫైన్ - CHENNAMANENI RAMESH CITIZENSHIP

మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు ఎదురుదెబ్బ - పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు - చెన్నమనేని జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన ఉన్నత న్యాయస్థానం

High Court On  Chennamaneni Citizenship
High Court On Chennamaneni Ramesh Citizenship (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2024, 12:05 PM IST

Updated : Dec 9, 2024, 12:48 PM IST

High Court On Chennamaneni Ramesh Citizenship : వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది. ఆ దేశ పౌరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొంది. కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హైకోర్టు సీరియస్ అయింది. జర్మనీ పౌరసత్వంతోనే ఆయన అక్కడికి వెళ్లారని తెలిపింది. ఆయనకు రూ.30లక్షల జరిమానా విధించింది. దీనిలో రూ.25లక్షలు ప్రస్తుత ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఇవ్వాలని, రూ.5లక్షలు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

గతంలో పౌరసత్వాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు జర్మనీ పౌరసత్వం ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో భారత పౌరసత్వం పొందారని కాంగ్రెస్‌ నేత, వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ గతంలో కేంద్రానికి ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన కేంద్ర ప్రభుత్వం 2017లో రమేశ్‌ భారత పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు పేర్కొంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా మరోసారి పరిశీలించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పునఃపరిశీలించిన కేంద్రం తమ నిర్ణయం సరైందేనంటూ రమేశ్‌ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు మరోసారి తెలిపింది.

దీంతో చెన్నమనేని రమేశ్‌ మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. చెన్నమనేని జర్మనీ ప్రయాణ వివరాలు ఇవ్వాలని కేంద్రానికి తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం రికార్డును అందజేసింది. మరోవైపు చెన్నమనేని జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు మెమో దాఖలు చేశారు. దీంతో చాలా సంవత్సరాల నుంచి చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. కాగా ఈ కేసుకు సంబంధించి ఈ రోజు తెలంగాణ హైకోర్టులో విచారణ పూర్తవ్వగా పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్డు కొట్టివేసింది. చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

చెన్నమనేని రమేశ్​కు జర్మన్‌ పాస్‌పోర్టు ఉంది - కేంద్ర హోం శాఖ నివేదిక

Chennamaneni Citizenship Dispute: 'చెన్నమనేని పౌరసత్వ రద్దుకు తగిన కారణాలు లేవు'

Last Updated : Dec 9, 2024, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details